ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్‌లో అగ్రిగోల్డ్ వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిటీ ఆధ్వర్యంలో ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును పంపిణీ చేస్తామని ఆంధ్ర సిఐడి చీఫ్ ద్వారక తిరుమలరావు చెప్పారు. జ్యుడీషియల్ కమిటీ తొలి విడతగా వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఆరు ఆస్తుల వేలం ప్రక్రియను ఏప్రిల్ 20,21 తేదీల్లో చేపడుతుంది. ఎటువంటి పరిస్ధితుల్లో బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆస్తుల వేలం, డిపాజిట్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుందన్నారు. దీని గురించి మార్కెట్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. హైకోర్టు ఆధ్వర్యంలోని కమిటీకి సిఐడి శాఖ సహకరిస్తోందని, తాము ఇంతవరకు కనుగొన్న ఆస్తుల వివరాలను అందచేశామన్నారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో కూడా పెట్టామన్నారు. అగ్రిగోల్డ్ కేసు సంపూర్ణంగా హైకోర్టు పర్యవేక్షణలో సాగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసు పూర్వపరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని డిపాజిట్‌దార్లకు కోర్టు సహకారంతో చెల్లింపులు చేయాలని కోరారన్నారు. సిఐడి శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు అగ్రి గోల్డ్ కేసును కూలంకషంగా దర్యాప్తు చేస్తూ హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదికను అందిస్తున్నట్లు చెప్పారు.