రాష్ట్రీయం

నేడే నింగిలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 13: సమాచారం రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావస్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ 2 రాకెట్ ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2:50గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అనుకొన్న దానికంటే 40నిమిషాల ముందే కౌంట్‌డౌన్ శాస్తవ్రేత్తలు ప్రారంభించారు. ఈ రాకెట్ ద్వారా 3600కిలోల బరువుగల జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ రాకెట్ విజయం కోసం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన సమయానికే రాకెట్ ప్రయోగం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన షార్‌కు చేరుకొని షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్,శాస్తవ్రేత్తలతో కలసి రెండో ప్రయోగ వేదిక వద్దకు వెళ్లి కౌంట్‌డౌన్ ప్రక్రీయను పరిశీలించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ వివరాలడిగి తెలుసుకున్నారు.
గత ఏడాది ప్రయోగించి జీశాట్-19 సమాచార ఉపగ్రహంతో దీనిని అనుసంధానం చేసి సమాచార రంగాన్ని మరింత బలోపేతం చేసి నూతన ఒరవడిని తీసుకొచ్చేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. ఇంత భారీ స్వదేశీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భూమి నుంచి రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం 16.43నిమిషాల్లో ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 రాకెట్ రోదసీలోకి విడిచిపెట్టనుంది. 16నిమిషాల్లో రాకెట్ 207కి.మీ ఎత్తులోకి పోయినంతరం భూమధ్య రేఖకు ఏటవాలుగా 21.5డిగ్రీలో కోణంలో భూమికి దూరంగా 35975కి.మీ దూరంలో (అపోజి) భూమికి దగ్గరగా (ఫెరిజి) 190కి.మీ దూరంలో ఉపగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా చేరనుంది. కౌండౌన్ సజావుగా సాగినంతరం జీఎస్‌ఎల్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ సరిగ్గా 5:08నిమిషాలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.