ఆంధ్రప్రదేశ్‌

104 ప్రైవేట్‌పరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 25: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వారి ముంగిటకే అందించేందుకు ప్రభుత్వం 2010లో 104 సేవలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల గ్రామీణ పేదలకు ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందడంతోపాటు సాధారణ జబ్బులకు సైతం మందులు ఇంటి వద్ద పొందే సదుపాయం కలిగింది. అయితే ప్రభుత్వం వైద్య రంగంలో సంస్కరణల పేరిట వైద్య ఆరోగ్య శాఖను ప్రైవేట్‌పరం చేసే ప్రక్రియకు తాజాగా తెర తీసింది. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణకోసం శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ‘మెడాల్’ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకూ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నడుస్తున్న 104 సేవలను ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిలో ప్రైవేట్‌రంగానికి హస్తగతం చేసే ప్రక్రియ పూర్తయ్యింది. రాష్టవ్య్రాప్తంగా 104 సేవలను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పిరమిల్ స్వాస్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (పియస్‌ఎంఆర్‌ఐ)కు కట్టబెట్టనున్నారు. రాష్టవ్య్రాప్తంగా పిఎస్‌ఎంఆర్‌ఐ ఇప్పటికే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వైద్యాధికారి, స్ట్ఫా నర్సులను ఎంపిక చేసుకుంది. వీరు ప్రతి నెలా 20 క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్టవ్య్రాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచీ వీరి ఆధ్వర్యంలోనే 104 సేవలు నడవనున్నాయి. అయితే ఇప్పటివరకూ వీరికి వేతనాలను 104 ఎఫ్‌డిహెచ్‌ఎస్‌ల నుంచి ఇచ్చేవారు. దీనిని ప్రైవేట్ సంస్థకు అప్పగించనుండడంవల్ల ఇందులో పనిచేస్తున్నవారికి వేతనాలను ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఉన్న సిబ్బందిని తొలగించమని చెబుతున్నా వారికి వేతనాలను ఏ ఖాతా నుంచి ఇస్తారన్న దానిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటివరకూ 104 ఎఫ్‌డిహెచ్‌ఎస్ ఫండ్స్ ద్వారా అందులో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించేవారు. రాష్టవ్య్రాప్తంగా 104 సేవలు పిపిపి పద్ధతిలో ప్రైవేట్‌పరం కానుండడంతో 104లో పని చేస్తున్న సిబ్బంది భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.