రాష్ట్రీయం

టీడీపీలోకి రిటైర్డ్ ఐజీ దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అలూరి సుందర్‌కుమార్ దాస్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకుని పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సుందర్‌కుమార్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా నీరుల్లిపాలెం గ్రామానికి చెందిన సుందర్‌కుమార్ సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. 1987 సెప్టెంబర్ 7వ తేదీన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎంపికై డీఎస్పీగా పోలీస్ ఉద్యోగాన్ని ప్రారంభించారు. 1993లో పోలీస్ సేవా పతకం, 96లో ఉత్తమసేవా పతకంతో పాటు 2006లో ఇండియన్ పోలీస్‌మెడల్ అందుకున్న ఆయన సీఐడీ డీఐజీగా, నూతన రాజధానిలో తూనికలు, కొలతలశాఖ ఐజీపీగా పనిచేసి అపారమైన అనుభవం గడించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలుచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకు తాను పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇలావుండగా, ప్రముఖ సినీనటి, శంకరాభరణం చిత్రంతో సాంప్రదాయ నృత్యంలో గుర్తింపు సాధించిన మంజుభార్గవి మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణతో కలసి ఉండవల్లి సీఎం నివాసానికి చేరుకున్న మంజుభార్గవి ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.