రాష్ట్రీయం

ప్రజామోదం ఉంటేనే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: పార్టీలో ప్రతికూలత అనేది ఉండకూడదు.. నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సానుకూల దృక్పథంతో పనిచేయాలి అని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. తన జీవితంలో ప్రతికూల ధోరణి అనేదే లేదని, అంతా సానుకూలతే అని, మన ఆలోచనలు..చర్యలు అన్నీ సానుకూలంగా ఉండాలని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ వ్యూహకమిటీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్టప్రార్టీ ప్రధానకార్యదర్శులు, పార్టీ కార్యాలయ బాధ్యుల పనితీరు, సంస్థాగత కార్యకలాపాలు.. ఎలక్షన్-2019 మిషన్, గ్రామవికాసం, సభ్యత్వ నమోదు.. బూత్ కన్వీనర్ల శిక్షణ, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామవికాసం పురోగతి గత వారం కంటే 2 శాతం పెరిగిందని ఇప్పటి వరకు 6404 గ్రామాలు, వార్డులలో గ్రామవికాసం జరిగిందని చెప్పారు. మిగిలిన పదివేల గ్రామాలు, వార్డులలో కూడా ఉత్సాహంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ప్రబుత్వానికి పంపాలని పరిష్కార మార్గాలపై శ్రద్ధ చూపాలన్నారు. ఎమ్మెల్యేల ప్రజామోదంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, ఈసారి గెలిచే వారికే టికెట్లని, ప్రజామోదం ఉంటేనే సీటని ఆయన తేల్చిచెప్పారు. ఏరియా కోఆర్డినేటర్లు, బూత్ కమిటీ కన్వీనర్లు కూడా ప్రజామోదం పొందాలని నిర్దేశించారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుంటా నిరంతరం ప్రజల్లో ఉండే వారికే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంచేశారు.
గత 13 రోజుల్లో సభ్యత్వ నమోదు 8.92 లక్షలకు చేరిందని ఒక్కరోజులోనే అత్యధికంగా 99వేల 183 మంది సభ్యత్వం పొందారని బాబు వివరించారు. ప్రతి వారం లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంచేసి వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంకా 7వేల బూత్ కమిటీ కన్వీనర్లను ఎంపిక చేయాల్సి ఉందని, ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియ ముగించాలన్నారు. శిక్షణ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేయాలన్నారు. సంస్థాగత బలమే పార్టీకి సంపద.. బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు సమన్వయంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్బోధించారు. ప్రభుత్వానికి, పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టాలని దిశానిర్దేశం చేశారు. సంస్థాగత నిర్మాణం ఒక కళని, వ్యవస్థాగత నిర్మాణం కూడా ఒక కళే అన్నారు. పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారు ఎలాంటి వసతులు, సదుపాయాలు ఆశించరన్నారు. ప్రధాన కార్యదర్శిగా అప్పట్లో తాను రేకులషెడ్‌లో తన కేరేజీ తానే తెచ్చుకుని పనిచేశానని, ఇప్పుడు అన్ని వసతులు కల్పిస్తున్నామని, సాంకేతికత జోడిస్తున్నామని, ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. సకాలంలో సరైన నిర్ణయాలే రాజకీయ సోపానాలని తెలిపారు. నిర్ణయం తీసుకోవటంలో ముందు వెనుకలు ఉండరాదని అక్కడే నాయకత్వ సామర్థ్యం తేటతెల్లమవుతుందని చెప్పారు. ఈనెల 20న నెల్లూరు, 27న విజయనగరంలో జరిగే ధర్మపోరాట దీక్షలను విజయవంతం చేయాలన్నారు. తరువాత శ్రీకాకుళం, అనంతపురం, చివరగా కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడిసభగా అమరావతిలో జాతీయ పార్టీల నేతలతో పెద్దఎత్తున సభ నిర్వహిస్తామన్నారు. ఈనెల 15,16 తేదీల్లో జయహో బీసీ వర్క్‌షాప్‌ను జయప్రదం చేయాలన్నారు. వివిధ బీసీ కులాల నేతలు హాజరై చర్చించాలని సూచించారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి ఇంకా చేయాల్సిన వాటిపై దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ హమారా, దళిత తేజం సభలు నిర్వహించి ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలలో భరోసా కల్పించాలన్నారు. బలహీనవర్గాల ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించాలని నిర్దేశించారు. పార్టీలో సేవామిత్రల తరహలో దళితమిత్రలను తయారు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో దళితమిత్రలను ఎంపిక చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి, సంక్షేమం మన రాష్ట్రంలో చేశాం.. ప్రభుత్వాన్ని, పార్టీని సమాంతరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గత 54 నెలల్లో చేసిన అభివృద్ధిని గ్రామం యూనిట్‌గా, సంక్షేమాన్ని కుటుంబం యూనిట్‌గా నిర్దేశించుకుని ప్రచారం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ఇంటింటికీ వివరించాలన్నారు. కరపత్రాలు, గోడరాతల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు.