రాష్ట్రీయం

జగన్ కేసులో బాబుకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై వచ్చిన అభియోగాలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఏపీ సీఎంకు పంపిన నోటీసుల్లో హైకోర్టు సూచించింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ చేస్తున్న ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదని, వాటి స్థానంలో స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని జగన్మోహనరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌తో పాటు ప్రభుత్వ వాదనలను హైకోర్టు పరిశీలించింది. సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ ఠాకూర్, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, విశాఖ విమానాశ్రయం అధికారులకు, పోర్టు ఏరియా పరిధిలో ఉన్న డీసీపీకి, కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులను జారీచేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తన నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని, అలాగే సిట్‌లో పని చేస్తున్న అధికారుల వివరాలను సైతం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా సిట్ అధికారులను పలు అంశాలపై కోర్టు ప్రశ్నించింది. విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజ్ వివరాలు ఏమైయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించగా, అందుకు అధికారులు వివరణ ఇస్తూ గత మూడు నెలలుగా సీసీటీవీ ఫుటేజ్‌లు పని చేయడం లేదని అధికారులు చెప్పడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందన్న అంశంపై కూడా సిట్ అధికారులు సమాధానం చెప్పకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉండాల్సిన ఎయిర్‌పోర్టులో రక్షణ చర్యలు లేకపోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. భద్రతపై పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధింత అధికారులకు నోటీసులు జారీ చేసింది. హత్యాయత్నంపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టకూడదని జగన్ అడ్వకేట్‌ను కోర్టు ప్రశ్నించింది. డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యలను వైఎస్ జగన్ తరపు న్యాయవాది సీవీ మోహనరెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సినీ హీరో శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. రిట్ పిటిషన్‌లో పేర్కొన్న ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వాదనలను దమ్మాలపాటి శ్రీనివాస్ వినిపించారు.