రాష్ట్రీయం

వెలుగుల రారాజుకు 40 వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేడు ఎన్టీపీసీ రామగుండం ఆవిర్భావ దినోత్సవం....
గోదావరిఖని, నవంబర్ 13: విద్యుదుత్పత్తి రంగంలో రామగుండం రారాజుగా ఎన్టీపీసీ తన స్థానాన్ని పదిల పరుచుకుంటోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులను ప్రసాదిస్తోంది. ఇది అలుపెరగని వెలుగుల జైత్ర యాత్ర. ఇక్కడ.. నవంబర్ 14, 1978 సంవత్సరం పురుడు పోసుకున్న రామగుండం ఎన్టీపీసీకి నేటితో సరిగ్గా 40 వసంతాలను పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో దక్షణ భారత దేశానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి రామగుండంలో 2100 మెగవాట్ల సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ సంకల్పించిం ది. చాచా నెహ్రు జన్మదినం సందర్భంగా ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి 1983 వరకు యూని ట్ల నిర్మాణం శరవేగంగా కొనసాగింది. మొదటి 200 మెగవాట్ల యూనిట్ 1983లో విద్యుదుత్పత్తి చేయగా 500 మెగవాట్ల 6వ యూనిట్ 1989లోపు పూర్తయ్యింది. మొత్తం 500 మెగవాట్ల 3 యూ నిట్లు, 200 మెగావాట్ల 3 యూనిట్లు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దక్షణ భారత దేశానికి వెలుగులు పంచాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు వెలుగులు అందించింది. ఆయా రాష్ట్రా ల ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ మూల స్తంభంగా నిలవడంలో ఎన్టీపీసీ రామగుండం పాత్ర కీలకమైంది. సింగరేణి సంస్థ నుంచి 75శాతం బొగ్గు రవాణా చేసుకుంటూ మిగతా 20 శాతం బొగ్గును కోలిండియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ రోజు ల్లో శ్రీరాంసాగర్ నుంచి డి-83 కాలువ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా పైప్‌లైన్‌తో తీసుకుంటుంది. 3 టిఎంసిల వెయ్యి ఎకరాల రిజర్వాయర్ ఎన్టీపీసీ రామగుండంకు ఉంది. మరో వెయ్యి ఎకరాల యాష్ పాండ్ కూడా రాజాపూర్ వద్ద నిర్వహిస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల 2004లో 500 మెగవాట్ల 7వ యూనిట్ కూడా నిర్మించారు. ఈ యూనిట్ విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందాలే ఎం ఓ యు కుదుర్చుకున్నారు. అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పి ఎల్ ఎఫ్) సాధిస్తూ దాదాపు అన్ని యూనిట్లు విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. రక్షణ, పర్యావరణంలో అనేక అవార్డులు సాధించింది. విద్యుదుత్పత్తిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి గోల్డ్ మెడల్స్ వరుసగా సాధించింది. ప్రస్తు తం సమీప గ్రామాల్లో సిఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంది. ఎన్టీపీసీ రామగుండంలో సుమారు వెయ్యి మంది అధికారులు, ఉద్యోగులు, 3వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. కాగా బుధవారం ఎన్టీపీసీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఉద్యోగుల కృషి, పట్టుదలతోనే రాణిస్తోంది: ఈడీ రవీంద్ర
ఎన్టీపీసీ రామగుండం ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ఎన్టీపీసీ మిలినీయం హాల్‌లో మీడియా ప్రతినిధులతో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రవీంద్ర ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగుల కృషి, పట్టుదల, ప్రజల సహకారంతో రామగుండం ఎన్టీపీసీ వెలుగుల జైత్ర యాత్ర కొనసాగిస్తుందని అన్నారు. దక్షణ భారత దేశానికి వెలుగులు అందించడానికి రామగుండం యూనిట్లన్ని చక్కగా పని చేస్తున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం సి ఎస్ ఆర్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు నవంబర్ 2020కి పూర్తవుతాయని చెప్పారు. ఉద్యోగులకు, కార్మికులకు ఎన్టీపీసీ రామగుండం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మెనేజర్లు ఎకె జైన్, రామారావు, విజయ్ సింగ్, పికె లార్డ్, ఎం ఎస్ రమేష్, దాస్, సస్మిత డ్యాష్, గోకే, పోలాయి, పి ఆర్ ఓ సహదేవ్ సేతి పాల్గొన్నారు.