రాష్ట్రీయం

రోదసీపై ఇస్రో మార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 14: రోదసీ పరిశోధనలో భారత్ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల్లో విదేశాలు చేయలేని సాహసాన్ని మన శాస్తవ్రేత్తలు చేసి విజయం సాధించడంతో భారత్ అంతరిక్షంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. వినీలాకాశంలో భారత త్రివర్ణపతాకం మరోమారు రెపరెపలాడింది..స్వదేశీ క్రయోజనిక్‌తో మరో భారీ ప్రయోగంలో కూడా మన శాస్తవ్రేత్తలు సత్తా ఏమిటో మరోసారి నిరూపించారు. ఇస్రో కీర్తికిరీటంలో మరో కలిగితురాయి చేరింది... అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది... దేశ సమాచార వ్యవస్థను మరింత బలపడేలా 18ఏళ్ల కలల సాకారాన్ని మన శాస్తవ్రేత్తలు నిజం చేశారు. దీంతో షార్ నుంచి ఇకపై భారీ ఉపగ్రహ ప్రయోగాలను సైతం రోదసీలోకి పంపేందుకు మార్గం సుగమమం అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-డి 2 భారీ ఉపగ్రహ ప్రయోగం విజయబావుట ఎగరవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన జీశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-డీ 2 వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. దీంతో ఇస్రో తొలి భారీ ప్రయోగ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా క్రయోజనిక్ ప్రయోగాల్లో ఇస్రో ఆరోసారి వరుసగా రికార్డు విజయం సాధించింది. ఈ ప్రయోగ విజయం మన శాస్తవ్రేత్తల పని తనానికి నిదర్శనంగా నిలవడమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం మధ్యాహ్నం 2:50గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 26గంటల 10నిమిషాలు నిరాటకంగా కొనసాగింది. ఆ తరువాత బుధవారం సాయంత్రం సరిగ్గా 5:08గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డి 2 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కొంతసేపు ఉత్కంఠ నెలకొన్నా .. స్వదేశీ క్రయోజనిక్ భారీ ఉపగ్రహ ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ మరోసారి విజయాన్ని నమోదు చేసింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డి 2 వాహక నౌక జీశాట్-29 ఉపగ్రహాన్ని 16:43నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఉత్కంఠగా ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ రాకెట్ తన మూడు దశలను సునాయసనంగా పూర్తిచేసుకున్న అనంతరం విజయాన్ని విక్టరి గుర్తుతో అధికారికంగా ప్రకటించారు. అనంతరం శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ రాకెట్ ద్వారా 3,423కిలోల బరువుగల జీశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా (ఫెరిజి) 190కి.మీ. భూమికి దూరంగా (అపోజి) 35,975కి.మీ. ఎత్తులో జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (్భ బదిలీ కక్ష్యలో) ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకొని ఉపగ్రహంలో నింపిన అపోజి మోటార్లను మండించి భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరిచారు. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలకు పాకాయి. 18 ఏళ్లగా మనం కన్న కలలు సాకారం అవ్వడమే కాకుండా దేశ సమాచార వ్యవస్థ బరింత బలోపేతమైంది. ఇస్రో శాస్తవ్రేత్తలు భారీ కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అత్యంత భారీ రాకెట్‌ను మన భూ భాగం నుంచి మరోసారి ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కెఏ బ్యాండు, కెయూ బ్యాండు ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని ద్వారా హైస్పీడు ఇంటర్ నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 4జి టెక్నాలజి మరింత మెరుగుపడుతోంది. దీని సేవలు పదేళ్ల పాటు అందించనుంది. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేపట్టేందుకు మార్క్ 3 రాకెట్ ద్వారా ఆరు టన్నుల బరువు గల జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో తొలిసారిగా ప్రయోగించింది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో వరుసగా ఆరో ప్రయోగం విజయవంతం కావడం విశేషం. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన శాస్తవ్రేత్తలు రూపకల్పన చేసి విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగ విజయంతో ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి. అంతేకాకుండా మునుముందు భారీ రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమం అయ్యింది. గత ఏడాది జూన్ 5న విజయవంతంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 1 విషయం తెలిసిందే. మళ్లీ జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 ప్రయోగ ద్వారా ప్రయోగించిన జీశాట్-29 ఉపగ్రహ విజయంతో కమ్యూనికేషన్ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది.