రాష్ట్రీయం

ఇంటి ముందు అభివృద్ధి.. కంటిముందు అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 14: సిద్దిపేట నియోజకవర్గాన్ని కేసీఆర్ ఆశీస్సులతో ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు సిద్దిపేట టిఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆశీస్సులతో ఆరవసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజల దీవెనలతో ఐదుసార్లు భారీ మేజార్టీతో గెలిపించాలన్నారు. ఈసారి కూడ ప్రజలు భారీ మేజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంచుతారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నియోజకవర్గంలోని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిలా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సిద్దిపేటను జిల్లాగా చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. త్వరలోనే సిద్దిపేటకు రైలు, కాళేశ్వరం నీళ్లు వస్తాయ. కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది. దేశంలో, రాష్ట్రంలో ఏ అవార్డు వచ్చిన సిద్దిపేట పేరు ఉండడం ఖాయం. ప్రజలు మళ్లీ దీవిస్తే మీకు మరింతగా సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. సిద్దిపేట కోమటిచెరువును రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దా.’ మరోసారి నిండు మనస్సుతో ఓటు వేసి దీవించాలని హరీష్‌రావు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు రాధకిషన్‌శర్మ, చిన్నా, వెంకటేశ్వర్‌రావు, నందిని శ్రీనివాస్, మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.