రాష్ట్రీయం

కూటమిలో లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ సారధ్యంలోని కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ గందరగోళంగా మారడంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తనకు సానుకూలంగా మలుచుకోవడానికి పావులు కదుపుతోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు వేర్వేరుగా తమ అభ్యర్థులను ప్రకటించుకోవడంతో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. ఈ అసమ్మతి, విభేదాలతో తమ విజయవకాశాలను మరింత మెరుగుపరుస్తాయన్న ధీమా అధికార పార్టీలోకలిగింది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు వ్యవధి తక్కువగా ఉండడం, కూటమిలో పొడచూపిన అసమ్మతిని అరికట్టడం సాధ్యం కాదని ఈ పరిణామాలను సానుకూలంగా మలుచుకోవడానికి టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. కూటమిలోని సీపీఐ మినహా ఇతర పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి నుంచి టిక్కెట్ ఆశించిన నేతలు పలు చోట్ల రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కూటమి నుంచి బరిలోకి దిగిన అధికారిక అభ్యర్థి కాకుండా అవే పక్షాల నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగేవారికి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని టీఆర్‌ఎస్ తాజాగా పావులు కదపుతోంది. ప్రధాన ప్రత్యర్థికి వచ్చే ఓట్లను తిరుగుబాటు అభ్యర్థులు చీల్చడం వల్ల తమ విజయవకాశాలను మరింత మెరుగు పర్చుకోవాలన్నది అధికార పార్టీ తాజా వ్యూహం. కాంగ్రెస్, టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలతో చర్చించి చివరి వరకు బరిలోకి నిలిచేలా ఒప్పించడానికి కొందరు నేతలను, మధ్యవర్తులను టీఆర్‌ఎస్ రంగంలోకి దింపినట్టు విశ్వసనీయ సమాచారం. మధ్యవర్తుల్లో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఉన్నట్టు తెలిసింది. తిరుగుబాటు అభ్యర్థులతో పార్టీ నేతలు చర్చలు జరపడం వల్ల ఆయా పార్టీలు అప్రమత్తం అయ్యే ప్రమాదం ఉండటంతో సాధ్యమైనంత వరకు బయటి వ్యక్తుల ద్వారానే ప్రయత్నాలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలను ఎన్నికల ప్రచారం నుంచి మినహాయించి ప్రత్యర్థి పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు, నేతలకు గాలం వేసే బాధ్యతలను వీరికి అప్పగించినట్టు సమాచారం. కూటమి పక్షాల మధ్య జరగుతోన్న గొడవలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వారిని టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా మలుచుకోవడానికి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోన్నట్టు తెలిసింది. కూటమి అనేది విఫలప్రయోగమని, జరిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని టీఆర్‌ఎస్ గట్టి నమ్మకం. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఓట్లు ట్రాన్స్‌ఫర్ కావనీ టీఆర్‌ఎస్‌లో కీలకనేత మంత్రి కేటీఆర్ ఇటీవల తనను కలిసిన మీడియాతో వ్యాఖ్యానించడం గమనర్హం. రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదని, అది ఒక్కోసారి జీరో కూడా అవుతుందని కేటీఆర్ సూత్రీకరించారు. కూటమిలో తాజాగా జరుగుతోన్న పరిణామాలు కూడా తాము ఉహించినట్టే జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా మంచిర్యాల నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన గడ్డం అరవింద్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సన్నిహితుల వద్ద ప్రకటించగానే, ఆయన్ను టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సంప్రదించినట్టు సమాచారం. అలాగే వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి పొత్తులో టీడీపీకి కేటాయించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాయిని రాజేందర్‌రెడ్డితో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు రహస్య మంతనాలు జరుపుతోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణ జనసమితి టిక్కెట్ ఆశించి భంగపడిన రాజేందర్‌రెడ్డితో కూడా టచ్‌లో ఉండాలని టీఆర్‌ఎస్ ముఖ్య నేత ఒకరు ఆ జిల్లాకు చెందిన నాయకుడికి తాజాగా సూచించినట్టు సమాచారం.