రాష్ట్రీయం

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం నుంచి సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ బాలాజీని ఈ సందర్భంగా విచారించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎలాంటి చలానాలు విధించకుండా వసూలుచేసిన రూ.1,24,230 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఎలాంటి రసీదులు, ఆధారాలు లేకుండా దగ్గర ఉంచుకున్న రూ.1.24 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి నుంచి 14 సెల్‌ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యాలయం అధికారులు, ప్రైవేటు సిబ్బంది, స్టాంప్ రైటర్లను విచారిస్తామన్నారు. దాడుల్లో ఏసీబి సీఐ రామచంద్ర సిబ్బంది పాల్గొన్నారు.