రాష్ట్రీయం

ఇంటర్ షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ(జగదాంబ), నవంబర్ 14: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టీకల్, థియరీ పరీక్షల షెడ్యుల్‌ను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఇంటర్‌బోర్డు ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావుమాట్లాడారు. ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులకు 2019 జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష 2,855 పరీక్షా కేంద్రాల్లో 5,25,729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అదే విధంగా జనవరి 30న ఎన్విరాన్‌మెంట్ పరీక్ష కూడా ప్రథమ, ద్వితీయ విద్యార్థులు రాస్తారని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 925 పరీక్షా కేంద్రాల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి 3,41,252 మంది విద్యార్థులకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులతో పాటు, ఇన్విజిలెటర్లను కూడా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్‌వాల్యూస్, ఎన్విరానిమెంట్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడంతోపాటు, ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
27నుంచి థియరీ పరీక్షలు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలను 2019 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేది వరకూ నిర్వహించనున్నామని మంత్రి గంటా వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,448 పరీక్షా కేంద్రాల్లో 10.64లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 12గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు కూడా విద్యార్థులతోపాటు ఇన్విజిలెటర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నామని, విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని సులవుగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా లోకేటర్‌యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మాక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేకంగా సిట్టింగ్, ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాది తొలిసారిగా ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.