ఆంధ్రప్రదేశ్‌

గడువు దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: ముందుగా నిర్ణయించిన మేరకు గడువులోగా ఎపి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు సూచించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి గ్రామంలో ప్రారంభమైన తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడే తాత్కాలికంగా ఏర్పాటుచేసిన సమావేశ మందిరంలో నిర్మాణానికి సంబంధించి సిఆర్‌డిఎ అధికారులు, కాంట్రాక్టు సంస్థలైన ఎల్ అండ్ టి, పల్లోంజి షాపూర్జీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. తొలుత గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెలగపూడికి వచ్చిన చంద్రబాబు ముందుగా నిర్మాణ ప్రాంతాన్ని మూడుసార్లు విహంగ వీక్షణం చేశారు. అనంతరం నేరుగా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతానికి కాన్వాయ్‌తో చేరుకున్న చంద్రబాబు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కాలినడకన క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏర్పాటుచేసిన వ్యూ పాయింట్ ద్వారా నిర్మాణ వివరాలను కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, ఇంజనీర్ల ద్వారా తెలుసుకున్నారు. అక్కడే ఆయా బ్లాక్‌లకు సంబంధించి ఏర్పాటుచేసిన మ్యాప్ ద్వారా వివరాలను అధికారులు సిఎంకు తెలియజేశారు.
మల్కాపురం శాసనం సందర్శన
తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని మల్కాపురంలో 750 సంవత్సరాల క్రితం నాటి మల్కాపురం రాతి శాసనాన్ని చంద్రబాబునాయుడు సందర్శించారు. శుక్రవారం నాటికి 750 సంవత్సరాలు పూరె్తైన సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్థులు, సిఆర్‌డిఎ అధికారులు శాసన స్థూపాన్ని అందంగా అలంకరించారు. శాసనాన్ని పరిశీలించిన చంద్రబాబు అందుకు సంబంధించిన వివరాలను గ్రామస్థులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు శాసనం తాలూకు విశేషాలను సిఎంకు వివరించారు. కాకతీయుల కాలంలో 1270వ సంవత్సరంలో ఈ శాసనాన్ని కాకతీయుల ఆస్థాన స్తపతి విశ్వకర్మ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని రుద్రమాంబాపురంగా పిలిచేవారని, దక్షిణభారత దేశంలోని తొలి విశ్వవిద్యాలయమైన శైవ విజ్ఞాన విశ్వవిద్యాలయం, విశే్వశ్వర గోలకీమఠం ఉండేదని తెలిపారు. శిలాశాసనంపై కాకతీయుల వైభవాన్ని తెలియజెప్పే 200 శ్లోకాలు లిఖితమై ఉన్నాయని గ్రామస్థులు చంద్రబాబుకు వివరించారు. పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు పి నారాయణ, దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ తదితరులున్నారు.

చిత్రం తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం