రాష్ట్రీయం

మావోల రెక్కీతో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విరసం నేత వరవరరావుపై నిఘా పెంచిన పోలీసులు * భూపాల్‌పల్లి నియోజకవర్గంలో నక్సల్స్ పోస్టర్లు
* స్పీకర్ మధుసూదనాచారికి భద్రత పెంపు
హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ దండకారణ్యంలో మావోయిస్టుల కలకలం మొదలైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు క్షణక్షణం భయం భయంగా ఉన్నాయి. ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్యా అన్నట్టు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలోని ఉత్తరాంధ్రాలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల సంఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. కాగా మావోల కేంద్ర నాయకత్వానికి తెలంగాణకు నేతలు నేతృత్వం వహిస్తున్నందన పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గురువారం జరిగిన మావోల అలజడిపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు అత్యవసర భేటీ అయ్యారు. వరంగల్ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మావోల కదలికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ములుగు టీఆర్‌ఎస్ అభ్యర్థి చందూలాల్ గురువారం ఆకస్మికంగా తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. తాడ్వాయి మండల టీఆర్‌ఎస్ నేత శ్రీనివాసరెడ్డిని హత్య చేసేందుకు మావోలు ఏకంగా రెక్కీ నిర్వహించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గురువారం ఉదయం నుంచి శ్రీనివాస్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారికి భద్రతను మరింత పెంచారు. చత్తీస్‌గఢ్ నుంచి మావోలు మైదాన ప్రాంతంలోకి వచ్చారన్న సమాచారంతో ఎన్నికల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఉంది. ఎన్నికల నిర్వహణ వారికి కత్తిమీద సామే. అలాగే విరసం నేత వరవరరావుపై నిఘా పెంచారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం మావోయిస్టుల పోస్టర్లు బయటపడడం చూస్తుంటే రాబోయే రోజుల్లో విధ్వంసక ఘటనలు జరగబోతున్నాయా? అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. నక్సల్స్ కదలికలపై నిఘా వర్గాలు వైఫల్యం చెందాయన్న విమర్శలు బలపడుతున్నాయి. భూపాలపల్లి, ములుగు ప్రాంతల్లో మావోల యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నాయన్న కథనాలు అధికారుల్లో, రాజకీయ పార్టీల్లో కలకలం సృష్టించాయి. ముఖ్యనేతల్ని హత్య చేయడానికి దాదాపు 35 మందితో మావో యాక్షన్ టీమ్‌లు పని చేస్తున్నాయని సమాచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట, మంగంపేట్ మండలాల్లో మావోల పోస్టర్లు వెలిశాయి. ఎన్నికలను బహిష్కరించాలన్న నక్సల్స్ పిలుపుతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మరోపక్క భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నందున మావోలు అక్కడే మకాం వేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి కూంబింగ్ టీమ్‌లను పోలీసులు తరలిస్తున్నారు. మావోల ఆచూకీ కోసం డ్రోన్‌లు వినియోగించడం తప్పా మరొక మార్గం లేదన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది. మావో సానుభూతిపరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చే అన్ని రహదార్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. గ్రామీణ రహదారులపై మందుపాతర్ల ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో బాంబ్‌స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. భూపాలపల్లి, ములుగు ప్రాంతలకు వెళ్లే బందోబస్తు వాహనాలకు కోడ్ నెంబర్లు ఉంటే తప్ప పంపవద్దని పోలీసులు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్‌టీసీ బస్సులను రాత్రి 7 గంటలకే ఆయా డిపోలకు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం.