రాష్ట్రీయం

దేవేందర్‌గౌడ్ ఆస్తులపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎంపీ దేవేంద్రగౌడ్ ఆస్తులపై గురువారం ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 20 ఐటీ బృందాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. సోదాల్లో ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్రగౌడ్‌కు సంబంధించిన కంపెనీల్లో డిఎస్‌ఏ బిల్డర్లు పెట్టిన పెట్టుబడులపై అధికారులు ప్రధానంగా దృష్టిపెట్టారు. గౌడ్‌కు తెలంగాణతో పాటు ఆంధ్రాలో పలు కంపెనీలు ఉన్నాయి. టీడీపీ ఎంపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తల వివరాలను ఐటీ బృందాలు సేకరించాయి. గత మూడేళ్లుగా కంపెనీల్లో లావాదేవీల వివరాలు, బ్యాలెన్స్‌షీట్‌ను క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. కాగా దేవేంద్రగౌడ్ కుమారుడు వీరేంద్రగౌడ్ ఉప్పల్ నుంచి మహాకూటమి పక్షాన టీడీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఐటీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. ఐటి సోదాలపై వీరేంద్రగౌడ్ స్పందిస్తూ ఇలాంటి వాటికి భయపడేదిలేదని అన్నారు.