రాష్ట్రీయం

19 నుంచి కేసీఆర్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే రోజు నుంచే ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖరరావు నిర్ణయించారు. నామినేషన్ల గడువు ఈ నెల 19న ముగియనుండటంతో అదే రోజు ఖమ్మం, పాలకుర్తి (ఉమ్మడి వరంగల్ జిల్లా) బహిరంగ సభలను నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మంలో 19న మధ్యాహ్నం 3 గంటలకు, 4 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహిరంగ సభలు జరుగుతాయని టీఆర్‌ఎస్ పేర్కొంది. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థులలో ఇంకా చాలా మంది నామినేషన్లను దాఖలు చేయలేదు. రెండో జాబితాలో ప్రకటించిన 10 మంది అభ్యర్థులు ఈ నెల 19న మంచి ముహుర్తం ఉండటంతో ఆ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు 14, 19 తేదీలు రెండు రోజులు శుభ ముహుర్తాలుగా భావిస్తున్నారు. రెండో జాబితాను 14వ తేదీ సాయంత్రం ప్రకటించడంతో వారంతా ఈ నెల 19న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో అప్పటి వరకు ఎన్నికల ప్రచార సభలను నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుందనే 19న సాయంత్రం నుంచి ప్రచార సభలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. పైగా కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ప్రచార సభలు నిర్వహించడం వల్ల అప్పటి వరకు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా ఎవరో తేలుతారు. అభ్యర్థులు ఎవరో తేలాక ప్రచార సభలను నిర్వహించడం వల్ల ఫలితం ఉంటుంది తప్ప ప్రత్యర్థులు తేలకుండా నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని పార్టీ ముఖ్యులతో పాటు పలువురు అభ్యర్థులు అధినేత కేసీఆర్‌ను కోరడం వల్లనే వీటిని నామినేషన్ల గడువు ముగిసాక 19 నుంచి నిర్వహించాలని కేసీఆర్ తాజాగా నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రచారానికి తుది గడువు డిసెంబర్ 5 వరకు ఉంది. 19 నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే అప్పటికీ ఇంకా 16 రోజుల వ్యవధి ఉంటుందని, రోజుకు నాలుగు సభల చొప్పున దాదాపు60 సభలను నిర్వహించేలా ప్రచార కార్యక్రమం ఖరారు అయినట్టు సమాచారం. ఒకవైపు కేసీఆర్ సభలు జరుగుతుండగానే మరోవైపు 20వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో వారం రోజల పాటు మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించే షెడ్యూల్ కూడా ఖరారు అయినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.