జాతీయ వార్తలు

భారత్ అంటే నాకు ద్వేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 25: ముంబయిలో 2008లో ఉగ్రవాద దాడులు జరిగిన కొద్ది వారాల తర్వాత తన తండ్రి మృతికి సంతాపం తెలియజేయడానికి అప్పటి పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ తన ఇంటికి వచ్చినట్లు పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ వెల్లడించారు. కాగా, 1971 భారత్-పాక్ యుద్ధం సమయంలో తాను చదువుతున్న స్కూలుపై బాంబు దాడి జరిగినప్పటినుంచి తాను భారత్‌పై ద్వేషం పెంచుకున్నానని కూడా హెడ్లీ చెప్పారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన 55 ఏళ్ల లష్కరే తోయిబా టెర్రరిస్టు హెడ్లీని అమెరికానుంచి వీడియో లింక్ ద్వారా 2008 ముంబయి మారణ కాండ ప్రధాన కుట్రదారుగా నావిస్తున్న అబూ జుందాల్ తరఫు లాయరు అబ్దుల్ వాహబ్ ఖాన్ క్రాస్ ఎగ్జామ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2008 ముంబయి దాడులు జరిగిన నెల రోజుల తర్వాత చనిపోయిన తన తండ్రి అంత్యక్రియలకు అప్పటి పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ హాజరయ్యారని చెప్పడం సరికాదని, నిజానికి గిలానీ ఆ తర్వాత కొన్ని వారాలకు పాకిస్తాన్‌లోని తన ఇంటికి వచ్చారని హెడ్లీ ప్రత్యేక జడ్జి జిఎ సనప్‌కు తెలిపాడు. కాగా, పాకిస్తాన్ రేడియో డైరెక్టర్ జనరల్‌గా ఉండిన తన తండ్రికి లష్కరే తోయిబాతో తనకున్న సంబంధాల గురించి తెలుసునని, అయితే అది ఆయనకు ఇష్టం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా హెడ్లీ చెప్పాడు. లష్కరే తోయిబాతో నీకు సంబంధం ఉన్న విషయం మీ మారుటి సోదరుడు డేనియల్‌కు తెలుసా అని అడగ్గా, అతను, తాను పాకిస్తాన్‌లో ఒకే నగరంలో లేమని మాత్రమే హెడ్లీ చెప్పాడు. కాగా, ముంబయి దాడులకు ముందు డేనియల్ పాక్‌కు వచ్చినప్పుడు తాను అతని ఫోన్ ఉపయోగించానన్న ఆరోపణలను కూడా హెడ్లీ ఖండించాడు. చిన్నతనంనుంచే తాను భారత్ పట్ల ద్వేషాన్ని పెంచుకున్నానని హెడ్లీ చెప్పాడు. 1971 భారత్-పాక్ యుద్ధం సమయంలో తాను చదివే స్కూలుపై బాంబు దాడి జరిగిందని, ఆ దాడిలో చాలామంది చనిపోయారని, అప్పటినుంచే తాను భారత్‌పై ద్వేషం పెంచుకున్నానని, లష్కరే తోయిబాలో చేరడానికి అది కూడా ఒక కారణమని అన్నాడు. కాగా, ముంబయి మారణ కాండలో పాలు పంచుకున్న తొమ్మిది మంది టెర్రరిస్టులకూ పాక్ అత్యున్నత సాహస అవార్డు అయిన నిషాన్-ఇ-హైదర్ ఇవ్వాలని తాను తన మిత్రుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాకు చెప్పానని మరో ప్రశ్నకు సమాధానంగా హెడ్లీ చెప్పాడు. లష్కరే తోయిబాలో మహిళాదళం, లేదా ఆత్మాహుతి దళం ఉన్నట్లు తనకు తెలియదని కూడా హెడ్లీ చెప్పాడు. ప్రస్తుత వాంగ్మూలం ఇవ్వడానికి ముందు తాను అమెరికాలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌ను, ముంబయి పోలీసు జాయింట్ కమిషనర్ అతుల్ కుల్కర్ణిలను కలిసినట్లు వచ్చిన వార్తలను కూడా హెడ్లీ ఖండించాడు.