రాష్ట్రీయం

అయ్యప్ప భక్తుల ముసుగులో స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట: ఎర్రచందనం సంపదను దొంగిలించడానికి స్మగ్లర్లు ఆఖరికి అయ్యప్ప మాలధారులుగా మారిన సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద జరిగింది. క్రిష్ణాపురం గ్రామ సమీపంలో మాల ధరించిన భక్తుల ముసుగులో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని నరకడానికి శేషాచలం అడవుల్లోకి ప్రవేశించారు. టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. లోడింగ్‌పాయింట్ వద్ద గురువారం తెల్లవారు జామున అటవీప్రాంతం నుంచి వస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓ ప్రాంతంలో 9 ఎర్రచందనం దుంగలు, అయ్యప్ప భక్తులు ధరించే వస్త్రాలు ఉండటాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ స్మగ్లర్లు చివరకు అయ్యప్ప భక్తుల వేషంలో అక్రమాలకు పాల్పడం దారుణమన్నారు. ఎర్రసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. స్మగ్లర్ల ఆచూకీ తెలిసి వెంటనే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.