రాష్ట్రీయం

తేలని జనగామ జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితికి సీట్ల కేటాయింపుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయేంత వరకూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతే మళ్లీ చర్చిద్దామని ఉత్తమ్ ఆయనకు చెప్పి టీజేఎస్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఇలాఉండగా ప్రజా కూటమికి కామన్ మినిమమ్ ప్రొగ్రాం (సీఎంపీ) ఏర్పాటు చేయాలని, దానికి చట్టబద్ధత కల్పించి, చైర్మన్‌గా తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్‌ను నియమించాలని జన సమితి కోర్ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీజేఎస్ కార్యాలయానికి వచ్చినప్పుడు కోదండరామ్ టీజేఎస్ కోర్ కమిటీ చేసిన తీర్మానాలను ఆయనకు అందించారు. ఆ తీర్మానాల పట్ల తమకు అభ్యంతరం లేదని ఉత్తమ్ చెప్పారు. అంతకు ముందు టీజేఎస్ సమావేశమై కామన్ మినిమం ప్రొగ్రాం ఏర్పాటు, దానికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం ఆమోదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే, కామన్ మినిమమ్ ప్రొగ్రాం అమలు బాధ్యత కూడా ఆయనకే అప్పగించాలని కోర్ కమిటీ సభ్యులు మరో తీర్మానం చేశారు.
రాత్రి 11 గంటలకు..
శుక్రవారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తమ్ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌తో చర్చించేందుకు జన సమితి కార్యాలయానికి బయలుదేరారు. కాగా ఆర్‌సీ కుంతియా ఢిల్లీ నుంచి రావాల్సి ఉన్నందున ఆయన వచ్చాకే తిరిగి వస్తానని కోదండరామ్‌కు ఫోన్‌లో చెప్పి వెనుదిరిగారు. కాగా రాత్రి బాగా పొద్దుపోతుండడం, మరోవైపు కుంతియా రాకలో జాప్యం జరుగుతుండడంతో ఉత్తమ్ రాత్రి 11 గంటలకు మొజంజాహి మార్కెట్ సమీపంలోని టీజేఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జన సమితి చేసిన మూడు తీర్మానాలను కోదండరామ్ ఉత్తమ్‌కు అందజేశారు.
జనగామపై పట్టు
కాగా, సీట్ల సర్దుబాట్లపై ఉత్తమ్, కోదండరామ్ గంట సేపు చర్చించారు. అయినా కొలిక్కి రాలేదు. ముఖ్యంగా జనగామ సీటుపై ఇరువురూ పట్టుదలతో ఉండడంతో చర్చలు ఫలప్రదం కాలేదు. జనగామ సీటు ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలు, చిక్కులపై ఉత్తమ్ ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తమకు సీట్లు తక్కువ ఇస్తారు, అందులో మళ్లీ ఇన్ని షరతులా? అని కోదండరామ్ గట్టిగానే అన్నట్లు తెలిసింది. అయితే కుంతియా సమక్షంలోనే పరిష్కరించుకుందామని ఉత్తమ్ ఆయనకు చెప్పి బయలుదేరారు. శనివారం ఉదయం సీట్ల సర్దుబాటు చేసి, ఆ తర్వాత నామినేషన్ వేసేందుకు వెళ్ళాలని ఉత్తమ్ భావిస్తున్నారు.