రాష్ట్రీయం

త్వరలో బ్రిటన్‌కు కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ ప్రభుత్వం ఈనెల నాలుగున ఐటి పాలసీని ప్రకటించనుంది. అనంతరం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు బ్రిటన్‌లో పర్యటిస్తారు. బ్రిటన్‌లో ఐటితో పాటు ఇతర రంగాల కంపెనీల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు విదేశీ పర్యటన చేస్తున్నారు. కెటిఆర్ విదేశీ పర్యటనలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉంటారు. ఈనెల 13నుంచి కెటిఆర్ విదేశీ పర్యటన ప్రారంభం అవుతుంది. 13, 14 తేదీల్లో మారిషస్‌లో ఆయుష్ సదస్సు జరుగుతుంది. భారతీయ వైద్య విధానాన్ని మారిషస్‌లో అమలు చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయుష్ కేంద్రాలు, హోమియో, నాచురోపతి, యునానీ వంటి భారత వైద్య, విద్యా విధానాల రంగంలో మారిషస్ భారత సహకారం కోరుతోంది. మారిషస్‌లో ఆస్పత్రులు, కాలేజీల ఏర్పాటుకు సహకారం కోరుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కెటిఆర్‌ను ఆహ్వానించారు. మారిషస్ ఐటి నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఇదిలాఉండగా ఈ నెల 4న తెలంగాణ ప్రభుత్వం ఐటి పాలసీని ప్రకటించనుంది.