రాష్ట్రీయం

అసమ్మతి జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమకే సీట్లు కేటాయిస్తారని ఆశపడ్డవారికి అధిష్ఠానం మొండి చేయి చూపించడంతో నాయకులు రగిలిపోతున్నారు. అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీడీపీలోనూ అసమ్మతి జ్వాలలు హెచ్చుమీరాయి. కనీస కేడర్ లేని వారిని అభ్యర్ధులుగా ఎలా రంగంలోకి దించుతారని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరికి వారు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దిగుతుండగా, మరికొంత మంది పార్టీలకు రాజీనామాలు చేసి, వేరే పార్టీల్లో చేరుతున్నారు. తమ నేతకే టిక్కెట్ వస్తుందని భావించిన కార్యకర్తలు టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ ఆఫీసుల్లో గడబిడ సృష్టిస్తున్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయం ముందు టీడీపీ తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయంలో దత్తాత్రేయ ఫోటోను కూడా కార్యకర్తలు దగ్ధం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం కార్యకర్తలతో కిక్కిరిసి పోతోంది. టిక్కెట్లు దక్కిన నేతలు పాదయాత్రలు, ఇంటింటికీ వెళ్లి తమ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టగా, మరో పక్క అసమ్మతి నేతలతో పార్టీ కార్యాలయాలు రగిలిపోతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిరసనలు ఇంకా చల్లారలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహాకూటమి పరిస్థితి అనిశ్చితిగా మారింది. ఏకంగా టీడీపీ నిర్ణయం ఆయా పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఇబ్రహీంపట్నం టీడీపీ దక్కించుకుందని. టీడీపీ అభ్యర్ధిగా సామా రంగారెడ్డి పేరును ప్రకటించింది. వాస్తవానికి ఇబ్రహీంపట్నం సీటు కోసం కాంగ్రెస్ నేతలు హోరాహోరీ పోటీ పడ్డారు. ఇంకో పక్క మహాకూటమి అసమ్మతి నేతలు సైతం తనకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉందని రంగారెడ్డి భావిస్తున్నారు. తనను ఎల్బీనగర్‌కు మార్చాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి స్థానాలు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు వెళ్లడంతో ఆ నియోజకవర్గాల నుండి పోటీ చేద్దామని భావించిన టీటీడీపీ నేతలు భంగపాటుకు గురయ్యారు. అవసరమైతే అక్కడ రెబల్స్‌గా రంగంలోకి దిగాలనే యోచనలో వారున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేశామని, అకస్మాత్తుగా మహాకూటమి ఆవిర్భావంతో గత నాలుగేళ్లుగా తాము చేస్తున్న కృషి వృధా అయిందని వారు వాపోతున్నారు. కూటమి పోత్తులో భాగంగా ఇతరులకు ఎందుకు సీట్లు కేటాయించారో కూడా తమతో చర్చించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. టీటీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, మహిళా నాయకురాలు షకీలా రెడ్డి, సీనియర్ నేత అలీ మస్కతీ, వనం రమేష్, ప్రదీప్ చౌదరి, జీవీజీ నాయుడు, మధుకర్ తదితరులు ఆవేదన చెందుతున్నారు. తాము ఖచ్చితంగా గెలుస్తామని భావించిన సీట్లు కూడా మరో పార్టీకి ఇచ్చారని వారు పేర్కొంటున్నారు. కూకట్‌పల్లి టిక్కెట్‌ను నందమూరి హరికృష్ణ కుమార్తెకు కేటాయించడంతో అక్కడి నుండి టిక్కెట్ ఆశించిన ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అలకబూనారు.