రాష్ట్రీయం

తాజ్‌మహల్‌ను తలదనే్నలా అమరావతి భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 16: మంచినీటిలో నిర్వహించే వాటర్ రేసులకు కేంద్రంగా అమరావతిని చేస్తామని ఎఫ్1 హెచ్2వో గ్రాండ్ పిక్స్ పవర్ బోటింగ్ రేసుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం నగరంలో కృష్ణా తీరంలోని బెరంపార్కులో ఎఫ్1హెచ్2 వో గ్రాండ్ ప్రిక్స్ - 2018 రేసులను ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరీ, మనవడు దేవాన్ష్‌లతో కలిసి ప్రారంభించి నదిలో రేసులను తిలకించారు. అనంతరం భవానీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక సదస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పర్యాటక సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ, పర్యాటక శాఖ, హస్తకళల స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఫార్మూలా - 1 కార్ల రేసును తీసుకురావడానికి ప్రయత్నించానని, కానీ అమరావతికి అంతకన్నా మెరుగైన ఎఫ్1హెచ్2వో రేసులను తీసుకురాగలిగానన్నారు. కార్ రేసుల కన్నా నీరు శక్తిని ఇస్తుందన్నారు. మొత్తం ఏఫ్1హెచ్2వో రేసులు 7 నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు కాగా 6వ రేసు దుబాయి, 7వ రేసు షార్జాలో జరగనున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువున వైకుంఠపురం బ్యారేజీ, దిగువన చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ప్రకాశం బ్యారేజీ ఎగువున, దిగువున 70 - 80 కి.మీటర్ల పొడవున దీంతో వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణానదిలో 9 ఐలాండ్‌లు ఉన్నాయని, నదిపై ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని, దీనికి తోడు గ్రీన్‌పిల్డ్ రాజధాని రూపొందుతోందన్నారు. రాజధాని అమరావతిలో 9 నగరాలు, 27 టౌన్‌షిప్‌లు నిర్మాణం చేస్తున్నామని, ఒక టౌన్‌షిప్ నుంచి ఇంకొక టౌన్‌షిప్‌కు 5 - 10 నిమిషాల్లో చేరుకునే విధంగా నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఎడ్వంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, ఫారెస్ట్ టూరిజంకి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఏడాది నవంబర్‌లో ఎఎఫ్1 హెచ్2వో రేసులను అమరావతిలో నిర్వహిస్తామని, ఫిబ్రవరిలో వాటర్ ఫెస్టివల్‌ను వారం పాటు నిర్వహిస్తామన్నారు. ఏఏఫ్1హెచ్2వో రేసులు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేస్తున్నామన్నారు. తాజ్‌మహల్‌ను తలదనె్నలా అమరావతి నిర్మాణాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. టూర్ ఆపరేటర్లు, ఎడ్వంచర్ టూరిజం అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు భూమా అఖిలప్రియ, నారా లోకేష్, సతీమణి బ్రహ్మణి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పర్యాటక శాఖ చైర్మన్ జయరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఏఏఫ్1హెచ్2వో ప్రెసిడెంట్ నికోదేశాన్ డిర్మానో, యుఐఎం చైర్మన్ గాయస్ రఫాయల్, పర్యాటక ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఏపీ టూరిజం అథారిటీ ఎండీ హిమాన్షు శుక్లా, జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.