రాష్ట్రీయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 16: సీబీఐ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ అధికారులు ఇక నుంచి రాష్ట్రంలో తనిఖీలు చేయాలన్నా, కేసుల విచారణకు రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు రాష్ట్ర పరిధిలోని ఏసీబీ చూస్తుందని ఈ ఆదేశాల్లో పేర్కొనడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, ఆదాయ పన్ను శాఖ, టెలికాం, పోస్టల్, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు తదితర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలు ఇక రాష్ట్ర పరిధిలోని ఏసీబీ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన అధికారాలు ఏసీబీకి కల్పించేందుకు త్వరలో వీలు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమపై దాడులు చేసే అధికారం ఏసీబీ అధికారుల చేతికి వస్తే ఇకపై మరింత జాగ్రత్త పడాల్సి వస్తుందని కేంద్ర ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ఉద్యోగులపై దాడి చేయాలంటే సీబీఐ అధికారులే రావాలన్న నిబంధన ఉంది. పైగా సీబీఐ వారు రాజధాని, ముఖ్యమైన నగరాల్లో మాత్రమే ఉండటంతో కేంద్ర ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు సైతం తమను ఏమీ చేయలేరన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ల ఆదేశాలను సైతం ఖాతరు చేయరన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులతో త్వరలో కేంద్ర ఉద్యోగులపై దాడి చేసే అవకాశం ఏసీబీకి వస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.