రాష్ట్రీయం

ముస్లింలు వారికి ఓటు బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మైనారిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి * ఇమామ్‌ల భేటీలో ఆపద్ధ్దర్మ మంత్రి
హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 17: రాష్ట్రంలో ఇప్పటి వరకు పాలన కొనసాగించని పాలకులంతా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, తమ హయాంలోనే ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ హయాంలో నగరంలో మతఘర్షణలు పూర్తిగా తగ్గి, శాంతిభద్రతలు సాఫీగా కొనసాగుతున్నాయని వివరించారు. నాంపల్లి రోజ్‌గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం అధ్యక్షతన జరిగిన ముస్లిం మత పెద్దలు హఫీజ్, ఇమామ్, మోజమ్స్‌ల సమావేశానికీ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. గత ప్రభుత్వాలు వారి అభివృద్ధిని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ హయాంలో సీఎం కేసీఆర్ మాత్రం ముస్లింలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తూ, పలు పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారని వివరించారు. విద్యా, అర్థికాభివృద్ధి, సంక్షేమాన్ని గత పాలకులు విస్మరించారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల్లో ప్రజలందర్నీ సమానంగా చూసిన ఏకైక సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. షాదీ ముబాకర్, రెసిడెన్షియల్ స్కూళ్లు వంటి స్కీములతో ప్రతి పేదవాడ్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9800 మంది ఇమామ్‌లకు భృతి చెల్లిస్తున్నామని వివరించారు. మైనార్టీల సంక్షేమానికి ఏకంగా రూ.2వేల కోట్లను కేటాయించిన ఏకైక, మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని వివరించారు. రైతుకు, గృహాలకు, పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత కూడా టీఆర్‌ఎస్‌దేనని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా దక్కని గౌరవం ముస్లింకు తెలంగాణలో దక్కుతోందని వివరించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి హింసకు తావులేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రెండో మహాత్మగాంధీ కేసీఆర్ అని అభివర్ణించారు. దళితుల కన్నా వెనుకబడి ముస్లింలు ఉన్నారని, విద్యా, ఆర్థికాభివృద్ధిలో వెనకబడ్డ వారిని ముందుకు నడిపించేందుకు కేసీఆర్ గత పాలకులతో కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉర్దూను రెండో భాషగా చేర్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మహ్మద్ ఖాధ్రి, జాఫర్, మక్కా మసీదు ఇమామ్ మహ్మద్ ఉస్మాన్, మతపెద్దలు, ఇమామ్‌లు తదితరులు హాజరయ్యారు.