రాష్ట్రీయం

పీపుల్స్ ఫ్రంట్‌గా మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 17: మహాకూటమిని ఇక మీదట పీపుల్స్ ఫ్రంట్‌గా పిలవాలని, డిసెంబర్ 11న తెలంగాణలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా అట్టహాసంగా భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుడూ తెలంగాణలో నాలుగున్నర సంవత్సరాల మూడునెలల కేసీఆర్ నియంతృత్వ, అప్రజాస్వామిక, అవినీతి, కుటుంబ పాలనకు ముందస్తు ఎన్నికలతో తెరపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రంట్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య సాగుతున్న సమరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలకు ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తోందని, ఐదేళ్ల పరిపాలన చేతగాక ప్రాజెక్టులు, పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కమిషన్లతో కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప తెలంగాణ కోసం పోరాడిన ప్రజలకు నాలుగేళ్లలో ఒరిగిందేమి లేదన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడ్టామంటు ప్రచారం చేస్తున్న కేసీఆర్‌కు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలుకు, డబుల్ బెడ్ రూమ్‌లకు, దళితులకు మూడెకరాల భూమికి, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ఎవరు అడ్డుపడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల గారడికి కాలం చెల్లిందని.. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, యువత , రైతులు కేసీఆర్ అసమర్థ పాలనకు చరమగీతం పాడేందుకు నిశ్చయించుకున్నారని ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో పీపుల్స్ ఫ్రంట్ ఘనవిజయంతో తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. తనకు పిల్లలు లేరని.. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రజలనే పిల్లలుగా భావించి వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతలు తనపై ఉన్నందున నియోజకవర్గంలో ప్రచారానికి సమయం లేదని, ప్రజలు అర్థం చేసుకుని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి, నాయకులు వంగాల స్వామిగౌడ్, హఫీజ్‌ఖాన్ తదితరులు ఉన్నారు.