రాష్ట్రీయం

ప్రపంచస్థాయి పోటీలకు అమరావతి అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 17: సాంస్కృతిక, చారిత్రిక ప్రఖ్యాతితో పాటు, అన్ని వౌలిక సదుపాయాలు ఉన్న అమరావతిలో ప్రపంచస్థాయి పోటీలను నిర్వహించేందుకు ఎంతో అనుకూలంగా ఉందని ప్రపంచ క్రీడా రంగంలో రెండో స్థానంలో ఉన్న యుఐఎం (యూనియన్ ఇంటర్నేషనల్ మోటోనాటిక్) చైర్మన్ రాఫెల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, అధికారుల శ్రమ కలిసి ఫార్మలా 1 బోట్ రేస్‌లు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో అమరావతి కేంద్రంగా బోట్ రేసింగ్ అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏప్1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ పోటీల్లో భాగంగా రెండో రోజు శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న ఫార్ములా 1 బోట్ రేసింగ్ పోటీలు అమరావతిలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీల నిర్వహణకు ఏపీ సీఎం చంద్రబాబు చూపిన చొరవ, కృషి, సహకారం మరువలేనిదన్నారు. అన్ని వసతులు ఉన్న అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ది ఒకే రోజులో సాధ్యం కాదన్న ఆయన అభివృద్ది చెందిన దేశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఇటువంటి సమయంలో ఏపీలో ఈ పోటీలను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ముందుకు రావడం సుభపరిణామన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పోటీల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఏపీలో ఉన్న వాణావరణ పరిస్థితులను రేసింగ్ డ్రైవర్లు అలవాటు చేసుకుంటున్నారని తెలిపారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కృష్ణానదిలో మాత్రం పోటీలను ఎంతో అనువుగా ఉందన్నారు. ఇటువంటి పోటీలను నిర్వహించేందుకు కఠోర శ్రమతో పాటు రక్షణ ఎంతో ముఖ్యమన్నారు. గంటకు 250 నుండి 300 కిలోమీటర్ల వేగంలో రేస్ బోట్లు దూసుకు పోతున్న తీరు వర్ణించలేనిదన్నారు. పవర్ బోటింగ్ రేసింగ్ పోటీలు చూసిన వారి మనసుకు ఎంతో ఉత్కంఠగా అనిపిస్తుందని ఏఫ్1హెచ్2వో ఫార్ములా 1 ఇండియా ప్రతినిధి, మహాలక్ష్మీ గ్రూప్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ్యత చెందుతున్న ఫార్ములా 1 బోట్ రేస్‌లు ఏపీలో నిర్వహించడం శుభపరిణామన్నారు. అమరావతిలో టూరిజియం పెంచే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రపంచంలోని 56 దేశాల్లో కోట్ల మంది అభిమానులు పరోక్షంగా వీక్షించనున్నట్లు తెలిపారు. అమరావతిలోని ఇబ్రహీంపట్నంలో సుమారు 10 ఏకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంలో బోట్ రేసింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాటల్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇండియా టీంకు విదేశీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, త్వరలోనే ఇండియన్ డ్రైవర్స్‌తో పోటీల్లో పాల్గొంటామని ధీమా వ్యక్తం చేశారు. బోట్ రైసింగ్ పోటీలను కృష్ణానది ఎంతో అనుకూలమన్న ఆయన కృష్ణా తీరాన్ని ఎన్టీఆర్ సాగర్‌గా నామకరం చేయడం హర్షింగదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ఈ క్రీడను మరింత ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్లు ఆయన వివరించారు.