రాష్ట్రీయం

‘కోడికత్తి’ బాబు కుట్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం(రూరల్), నవంబర్ 17: చంద్రబాబూ... నన్ను మట్టు పెట్టడానికి ప్రయత్నించింది నువ్వుకాదా...? అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనపై కోడికత్తి దాడి జరిగాక కొన్ని రోజుల విరామం తర్వాత ఆరంభమైన ప్రజా సంకల్పయాత్ర శనివారం పార్వతీపురంలో జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను చేసిన తప్పు ఏమిటి? ప్రజాపక్షాన పోరాడడమేనా? పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి కుట్ర పన్నారన్నారు. దీనిలో భాగంగా మార్చి 22న సినిమా నటుడుతో ఆపరేషన్ గరుడ తీసుకొచ్చి, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించి, ప్రతిపక్ష నాయకుడిమీద దాడి, రాష్ట్రం అతలాకుతలం అంటూ ప్రజలను నమ్మబలికించారని ఆరోపించారు. ఆ కుట్రలో కత్తి దాడిలో చనిపోతే ఎయిర్ పోర్టు పరిధి తమ అధీనంలోకి రాదని, ఆ నేరాన్ని కేంద్రంపై నెట్టేందుకు, లేకపోతే ఆపరేషన్ గరుడ మీద నెట్టేందుకు స్కెచ్ వేశారన్నారు. ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్ చౌదరిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తాను విశాఖలో పాదయాత్రకు అడుగు పెట్టినప్పటినుండే సీసీ కెమెరాలు పనిచేయలేదని చెబుతున్నారన్నారు. సంఘటన జరిగిన గంటలోపే డీజీపీ, తర్వాత హోం మంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రి అది జగన్ అభిమాని చేసిందని కొట్టి పారేశారన్నారు. నిందితుని జేబులో లెటరు ఉందని, తర్వాత ముగ్గురి చేతిరాతతో మడతలు పడని కాగితాలు చూపించి చంద్రబాబు స్క్రిప్ట్‌ను అమలు చేశారని ఆరోపించారు. నేను ముఖ్యమంత్రి కావాలనే అభిమాని అయితే హత్యాయత్నానికి ప్రయత్నిస్తాడా అని ప్రశ్నించారు. గరుడ బొమ్మతో ప్లెక్సీలు సృష్టించారని, హత్యాయంత్నం కుట్రలోకి అమ్మని, చెల్లిని చేర్చి దిగజారుడు చర్యకు చంద్రబాబు దిగజారాడన్నారు. దాడి జరిగాక ట్రీట్‌మెంట్ అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి వెళితే, వెళ్లలేదన్నారు. సెక్యూరిటీలో ఉన్న రాష్ట్ర పోలీసులను అడిగితే తెలియదా? అని ప్రశ్నించారు. హత్య చేయించడానికి ప్రయత్నించిన చంద్రబాబు, దర్యాప్తు చేయిస్తే న్యాయం జరుగుతుందా? అన్నారు. మూడో సంస్థతో చేయించాలని కోరితే ఇప్పుడు సీబీఐ వద్దు అంటూ జీఓ జారీ చేశారని జగన్మోహన్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ఓదార్పులో కాంగ్రెస్‌తో విభేదిస్తే అప్పుడు కాంగ్రెస్‌తో కలిసి నాపై దర్యాప్తు చేయించిన సమయంలో సీబీఐ ముద్దా? అని నిలదీశారు. ఎయిర్‌పోర్టులో హత్య కుట్ర చంద్రబాబుది కాకపోతే ఎందుకు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించడం లేదన్నారు. సీబీఐతో ఎంక్వయిరీ చేయిస్తే జైలుకు పోతారనే భయంతో చేయించడం లేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఎవరిమీద నిందలు వేయకుండా కోడి కత్తిలో విషముందేమోనని హైదరాబాబు చికిత్సకు వెళ్లానన్నారు. చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు వస్తామంటున్న జాతీయ పార్టీలకు, ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొని, వారికి మంత్రి పదవులిచ్చిన చంద్రబాబు దుశ్చర్య, రాజ్యాంగ విరుద్ధ చర్యలని విమర్శించారు. చంద్రబాబు పిలిస్తే గంగిరెద్దులా తలాడించే జాతీయపార్టీ నేతలకు బాబు నీతిమాలిన చర్యలు కనిపించడం లేదా అని తను ప్రశ్నిస్తున్నానన్నారు. రాజధాని గ్రాఫిక్స్ సింగపూర్‌ని, లండనని, బాహుబలి అని ఎన్ని రోజులు చూపిస్తారన్నారు. రాష్ట్రంలో 507 మండలాలు తీవ్ర కరవుతో ఉంటే మోడీపై పోరాటమంటూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి, లంచాల పాలన సాగిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు రేట్లు పెంచి, చివరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ వియ్యంకుడికి, మిగతా దగ్గరవారికే కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులిస్తున్నారన్నారు. డబ్బు సంపాదన కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, తనకు డబ్బుపై వ్యామోహం లేదని, ప్రజలకు 30 ఏళ్ల సేవ చేయాలని ఉందని, చనిపోయాక, తన తండ్రి ఫోటో మాదిరిగా ప్రతీ ఇంట తన ఫోటో పెట్టుకోవాలనే ఆశతో తాను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే సొంత కంపెనీ హెరిటేజ్‌కు తక్కువ ధరలకు కొని మూడు రెట్లు అమ్మకాలు చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్‌లో హాయ్‌లాండ్‌ను తదితర ఆస్తులను చంద్రబాబు, లోకేష్‌లో దోచేసి బాధితులను అన్యాయం చేస్తున్నారన్నారు. కోట్లు డబ్బులిచ్చి అడ్డంగా దొరికిన చంద్రబాబు జైలుకు పోతాననే భయంతో సీబీఐపై జీఓ జారీ చేశారన్నారు. చంద్రబాబులాంటి తనపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం తన పోరాటం ఆగదని, తన సంకల్పం సడలదన్నారు. తన చివరి రక్తం బొట్టు కూడా ప్రజల కోసం పోరాడుతుందన్నారు.