రాష్ట్రీయం

ససేమిరా అనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25:‘్భరత్ మాతాకీ జై..’ అనే నినాదంపై వివాదం ముదురుతోంది. ఇందుకు వ్యతిరేకంగా ‘హిందుస్థాన్ జిందాబాద్’ పేరిట పాతనగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. పైగా మజ్లిస్ పార్టీ ముఖ్య నేతల ఫొటోలతో కూడిన ఈ పోస్టర్లను ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతటా అతికించారు. భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని ముస్లింలెవ్వరూ చేయరని యునైటెడ్ ముస్లిం ఫోరం తాజాగా ఓ తీర్మానం ఆమోదించింది. ఆ నినాదం చేసేందుకు ‘ఇస్లాం’ అంగీకరించదని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఇలాఉండగా హిందుస్థాన్ పేరిట, మజ్లిస్ నేతల నిలువెత్తు ఫొటోలతో భారీగా కటౌట్లు వెలవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. అందునా శుక్రవారం కావడం, గుడ్‌ఫ్రై-డే సెలవు రోజు కావడంతో నగరంలోని అన్ని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదుకు మధ్యాహ్నం నమాజ్ చేసేందుకు వందల సంఖ్యలో ముస్లింలు వచ్చారు. నమాజ్ ముగిసిన తర్వాత హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారేమో, ఫలితంగా ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానాలు అధికారుల్లో తలెత్తాయి. దాంతో అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కానీ ఎటువంటి ఘటనలు జరగకుండా సాఫీగా నమాజ్ ముగిసింది.
భారత్ మాతాకీ జై..నినాదాన్ని చేయబోమని తొలుత మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఘంటాపథంగా చెప్పిన సంగతి తెలిసిందే. హెచ్‌సియును సందర్శించిన జెఎన్‌యు నాయకుడు కన్హయ్య కూడా మతం ముసుగులో కుట్ర జరుగుతున్నదని, సమానత్వమే తన ఆశయమని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు యునైటెడ్ ముస్లిం ఫోరం అధ్యక్షుడు మునీరుద్దీన్ ముఖ్తార్ అధ్యక్షతన 11 ముస్లిం సంఘాల నాయకులు సమావేశమై భారత్ మాతాకీ జై అనే నినాదం చేయరాదని, హిందుస్థాన్ జిందాబాద్ నినాదం చేయడంలో తప్పేమి లేదని అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ జిందాబాద్ నినాదం చేయాలని తీర్మానించారు.
హిందువులు మా సోదరులు
ఇలాఉండగా యునైటెడ్ ముస్లిం ఫోరం అధ్యక్షుడు మునీరుద్దీన్ ముఖ్తార్ శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ‘అల్లా’ ఒక్కరే కాబట్టి, మరో దేవత గురించి నినాదం చేయడానికి ‘ఇస్లాం’ (షరియత్) అంగీకరించదని చెప్పారు. భారత్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనడంలో తప్పేమీ లేదని అన్నారు. ‘హిందుస్థాన్’ పదంలో కూడా హిందువులు అనే భావం ఉంది కదా? అని ప్రశ్నించగా, ‘హిందువులు మా సోదరులు’ కాబట్టి హిందుస్థాన్ అనడంలో తప్పేమీ లేదని ఆయన తెలిపారు. ఒక నినాదం చేయాలని పరమతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదని అన్నారు.
ముస్లింలు అనరుగాక అనరు..
సున్నీ ఉల్‌మా బోర్డు అధ్యక్షుడు
ముస్లింలంతా ‘అల్లా’ ఒక్కడేనని భావిస్తారని అఖిల భారత సున్నీ ఉల్‌మా బోర్డు అధ్యక్షుడు హజ్రత్ సయ్యద్‌షా హమీద్ హుస్సేన్ శుత్తారీ తెలిపారు. ముస్లింలెవ్వరికీ నచ్చని నినాదాన్ని చేయమంటున్నారని ఆయన చెప్పారు. ఆ నినాదంలో ఒక దేవి గురించి ఉందని, అల్లా ఒక్కరే అయినప్పుడు మరో దేవి గురించి పలికేందుకు ఇస్లాం అంగీకరించదని అన్నారు. ముస్లింలందరూ ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారని, ఈ నేలను అమితంగా ఆరాధిస్తారని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది ముస్లింలు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. 1942వ సంవత్సరంలో ప్రముఖ కవి రాంపర్‌షాద్ బిస్విల్, మేధావి అశ్వాఖుల్లా ఖాన్ ఆంగ్లేయులను ఎదిరించి ధైర్యంగా ‘హిందుస్థాన్ హమారా హై..’ అని నినాదాలు చేశారని ఆయన గుర్తు చేశారు. నాడు దేశ స్వాతంత్య్రం కోసం 1200 నుంచి 2000 మంది ఉల్మాలు ప్రాణ త్యాగం చేశారని, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వెంట అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో ముస్లిం మహానీయ నాయకులు పోరాటం చేశారని ఆయన తెలిపారు. అప్పుడు ఒక మతానికి చెందిన దేవి గురించి నినాదాలు చేయాలని ముస్లింలపై వత్తిడి తేలేదన్న విషయాన్ని గమనించాలని అన్నారు.