రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: కోదాడ, ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ (119) టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి అయింది. కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్, ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ను ఖరారు చేసింది. ముషీరాబాద్ సీటును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్‌కే ఖరారు చేయడం విశేషం. అలాగే కోదాడ అభ్యర్థిగా ఖరారు చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ రెండు రోజుల కిందటే టీఆర్‌ఎస్‌లో చేరారు. కోదాడ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్ లభించలేదు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ తాజా ఎమ్మెల్యే పద్మావతికే తిరిగి టికెట్ లభించడంతో కూటమి నుంచి టికెట్ ఆశించిన మల్లయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తి గురై తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు రంగంలోకి దిగి అతన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేర్చారు. కోదాడ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలో నిలవడంతో అక్కడ గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకంతో మల్లయ్య యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇలా ఉండగా ముషీరాబాద్ టికెట్ కోసం తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కోసం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చివరి వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. ముషీరాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ బరిలో ఉండటంతో అక్కడ గట్టి పోటీ ఇవ్వాలంటే బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావించింది. అయితే మంత్రి నాయిని నరసింహారెడ్డి అసంతృప్తికిలోను కాకుండా సీఎం కేసీఆర్ స్వయంగా నాయిని నరసింహారెడ్డిని ఒప్పించి ఆయన చేతుల మీదుగానే ముఠా గోపాల్‌కు బీ-్ఫరమ్ అందజేయాలని ఆదేశించారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కావడంతో అదే రోజు ఉదయం ముఠా గోపాల్‌కు నాయిని నరసింహారెడ్డి బీ-్ఫరమ్ అందజేస్తారని టీఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.