రాష్ట్రీయం

ఇక ప్రచార హోరు.. జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 23న మేడ్చల్‌లో సోనియా గాంధీ సభ * 25, 27, 28న బీజేపీ అధినేత అమిత్ షా ప్రచారం
* వచ్చే నెల 3, 5 తేదీల్లో మోదీ పర్యటన
హైదరాబాద్, నవంబర్ 18: శాసనసభ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం నేటి (సోమవారం) ముగియనుండటంతో ఇక వివిధ పార్టీల ప్రచారం వేడెక్కబోతుంది. నామినేషన్ల దాఖలు గడువు ముగింపు రోజు నుంచే టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మూడవ దశ ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో పాల్గొనడానికి ఆయన సూడిగాలి పర్యటనలు చేపడుతున్నారు.వచ్చే నెల డిసెంబర్ 5న ఎన్నికల ప్రచారానికి తుది గడువు కావడంతో అప్పటి వరకు 65 నుంచి 70 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించే విధంగా కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ సిద్ధం చేసింది. ఇతర రాజకీయ పక్షాలు కూడా తమ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులను ఆహ్వానించడంతో ఇక నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉధృతం కాబోతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్స్‌ను ప్రకటించాయి. ఈ నెల 23న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 25, 27, 28 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర పర్యటనను ఆ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఈ నెల 25న వికారాబాద్ జిల్లా తాండూరుకు రాబోతున్నారు. వచ్చే నెల 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచార పర్యటన ఖరారు అయింది. ఇప్పటికే బీజేపీ తరఫున పలువురు కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా దాదాపు ఇక్కడే మకాం వేసి పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ సుడిగాలి పర్యటన
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని అంతా కలియతిరిగేలా సుడిగాలి పర్యటన ఖరారు అయింది. 19వ తేదీ (సోమవారం19) ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మం జిల్లా కేంద్రంలో, 3.30 గంటలకు జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 20న సిద్దిపేట, హుజుర్‌బాద్, సిరిసిల్లా, ఎల్లారెడ్డిలో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 21న జడ్చర్ల, దేవరకొండ, నక్రెకల్, భువనగిరి, మెదక్, 22న ఖానాపూర్, ఇచ్చొడ (బోద్), నిర్మల్, ముధోల్, ఆర్మూర్‌లో జరిగే సభల్లో, 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ, 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్రా, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగల్లో కేసీఆర్ పాల్గొంటారు.