రాష్ట్రీయం

పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి బాబా 93వ జయంతి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తొలిరోజు శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. తొలుత బాబా సమాధి వద్ద సాయి సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవమూర్తులు, శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రశాంతి నిలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేణుగోపాలస్వామి విగ్రహాన్ని రథంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీలో శ్రీ సీతారాముల విగ్రహాలను ఉంచి ఊరేగించారు. దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. వేడుకల్లో విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, ట్రస్టు సభ్యులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.