రాష్ట్రీయం

30లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబఠ్ 18: రాష్ట్రంలో దాదాపు 30లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం సహా పంట దిగుబడులను పెంచేందుకు మైక్రో ఇరిగేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మైక్రో ఇరిగేషన్‌కు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ రైతులకు దగ్గర చేస్తోంది. ఇందుకు అవసరమైన ప్రోత్సహకాలు కూడా ఇవ్వడం ద్వారా ఈ విధానంలోకి మరింతగా సాగుభూమిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11.25 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ విధానంలో వ్యవసాయ సాగు జరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఈ విధానం అమలు చేయటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. 2002 నుంచి 2009 వరకూ 2.91 లక్షల హెక్టార్లలో ఈ విధానం అమలుచేయగా, 2009-14 వరకూ 2.71 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 2014-15 నుంచి ఇప్పటివరకూ 5.62 లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి చేరడం గమనార్హం. ఇందులో రాయలసీమలో 64 శాతం, కోస్తా ప్రాంతంలో 30 శాతం, ఉత్తర కోస్తా తీరంలో 6 శాతం మేర మైక్రో ఇరిగేషన్ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. మైక్రో ఇరిగేషన్‌లో నూతన ఆవిష్కరణలు కూడా ఉండాలని, ఇందుకు నిరంతర పరిశోధన, అభివృద్ధి కూడా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. యాంత్రీకరణతో పాటు దానిపై పర్యవేక్షణ కూడా అవసరమంటూ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో సాగు చేస్తున్న 11.25 లక్షల హెక్టార్లలో 71 శాతం మేర ఉద్యాన పంటలే కావడం గమనార్హం. దాదాపు 8.03 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ 65,133 హెక్టార్లలో, 15,126 హెక్టార్లలో చెరకు, 5176 హెక్టర్లలో పట్టుపరిశ్రమ, 23,603 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. 22 కంపెనీలు రాష్ట్రంలోని రైతులకు మైక్రో ఇరిగేషన్ సాగుకు సహకరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా మైక్రో ఇరిగేషన్ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతోంది. అనంతపురంలో 17,904 హెక్టార్లు, కడపలో 16,957 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ జరుగుతోంది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో దేశంలోనే అధిక విస్తీర్ణంలో మైక్రో ఇరిగేషన్ ఏపీలో అమలు కావడం గమనార్హం. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ఆటోమేషన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో నీటి వినియోగ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. దీంతో విద్యుత్, నీరు, ఎరువులు, కూలీల వ్యయం తగ్గి రైతుకు పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల సమస్యలను ఆయా మైక్రో ఇరిగేషన్ కంపెనీలు ఆన్‌లైన్‌లోనే పరిష్కరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ 59 శాతం, స్ప్రింక్లర్ విధానం 41 శాతం ఉండగా, ఇందులో డ్రిప్‌కు సంబంధించి 75 శాతం, స్ప్రింక్లర్‌కు సంబంధించి 22 శాతం ఏపీదే కావడం గమనార్హం. రైతులకు జరుగుతున్న మేలును దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో మరింత ఎక్కువ భూములను ఈ విధానంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.