రాష్ట్రీయం

ప్రాజెక్టులు పరుగెత్తేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: భారీ నీటిపారుదల ప్రాజెక్టులంటే దశాబ్ధాల తరబడి సాగడం ఇప్పటివరకూ రివాజుగా మారింది. 1930ల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇంకా శిలాఫలకాలకే పరిమితమైతే, 1964లో ప్రారంభమైన రామడుగు ప్రాజెక్టు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు మూడేళ్లలో ముగింపు దశలో ఆగిపోయిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి చూపిస్తామని ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలపై ఆశలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజానికి తెలంగాణను కోటి ఎకరాల సాగువీణ చేద్దామన్న లక్ష్యంతో ప్రభుత్వం, భారీ నీటి ప్రాజెక్టుల పూర్తిగా ఆశావహ ప్రకటనలు చేస్తోంది. మరోపక్క, పనులు చివరి దశలోవున్న ప్రాజెక్టుల్ని రెండు నెలల నుంచి ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టూ ప్రకటిస్తోంది. నాలుగేళ్ల కాలంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కూడా. అలాగే, పలు చిన్న ప్రాజెక్టుల పనులనూ ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులు ముగింపు దశలో ఉన్నాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి, రాజీవ్ బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు వంటివి సత్వరం పూర్తి చేయనున్నారు. ప్రత్యేకంగా దృష్టి సారించి భూసేకరణతోపాటు ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. రెండు మూడేళ్లలో పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. మూడు నాలుగేళ్లలో మొత్తం కోటి 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తిచేసే విధంగా పనులకు టెండర్లు పిలిచారు.
కినె్నరసాని పనులు ఈ ఏడాది పూర్తి
ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్ గ్రామ సమీపాన గోదావరి ఉప నది కినె్నరసానిపై నిర్మించనున్న ప్రాజెక్టు పనులన్నింటినీ ఈ ఏడాది పూర్తిచేసి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలనేది లక్ష్యం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పారిశ్రామిక యూనిట్లకు నీటిని సరఫరా చేయడంతో పాటు, పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం పనిలో 69శాతం పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మిగిలిన పని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా పాలెంవాగు ప్రాజెక్టు పనులను సైతం ఈ ఏడాది పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని 10,132 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వెంకటాపురం మండలంలోని 39 గ్రామాలకు మంచినీరు అందించాలన్నది లక్ష్యం. ప్రధాన రెగ్యులేటరు ఆర్‌ఎఫ్ కాలువలో 13.5 కిలోమీటర్ల పనికి 11 కిలోమీటర్ల పని పూరె్తైంది. ఈ ఏడాది ప్రాజెక్టు పనులు మొత్తం పూర్తవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. నల్లగొండ జిల్లా ఆసిఫ్‌నహార్ ప్రాజెక్టు 1905లో నిజాంకాలంలో ప్రారంభించారు. ఆసిఫ్‌నహర్ ఆధునీకరణకు జెబిఐసి-2 పథకం కింద చేపట్టారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొన్ని నెలల్లోనే పని పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒకటవ ప్యాకేజీ నుంచి 18వ ప్యాకేజీ వరకు జనవరిలో టెండర్లు పిలిచారు. మొత్తం పనులు 30 నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం జూన్ 2016 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. అంటే ఇంకా కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం 2007లో చేపట్టారు. 699 కోట్ల రూపాయలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు 37 శాతం పనులు పూరె్తైనట్టు చెబుతున్న అధికారులు, జూన్ 2017 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నారు. భారీనీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు ఘనంగావున్నా, గతంలో జరిగిన ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవేగంగా నిర్మాణాలు పూర్తి చేయడం సాధ్యమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.