రాష్ట్రీయం

రబీలో ప్రతి ఎకరాకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో రబీ సాగులో ప్రతి ఎకరానికి సాగునీరందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై కలెక్టర్లు, వివిధశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు వర్షపాతం ప్రధాన సమస్యగా మారిందని, ఇప్పటి వరకు 35 శాతం మైనస్ వర్షపాతం నమోదైందని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలించామని, కృష్ణాజలాలను రాయలసీమకు అందించ గలిగామన్నారు. నదుల అనుసంధానం, జలసంరక్షణే మనకున్న ప్రత్యామ్నాయమని తెలిపారు. రబీలో ఇప్పటికే 106 శాతం నాట్లు పడ్డాయని సాధారణం కంటే 30వేల హెక్టార్లలో సాగు పెరిగిందని వివరించారు. ముందస్తు వరిసాగు శుభ పరిణామమని సాగుచేసిన ప్రతి ఎకరంలో పంటను కాపాడాల్సి ఉందన్నారు. కత్తెర తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మొక్కజొన్న నుంచి జొన్న వరకు తెగులు విస్తరిస్తోందన్నారు. సరిహద్దు జిల్లాల రైతాంగాన్ని చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. జలసంరక్షణపై ఎంతో శ్రద్ధ పెట్టామని, తెగుళ్ల నివారణపై అంతకు మించి దృష్టి సారించాలని కోరారు. తెగుళ్ల నివారణపై వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయం నుంచి ఉద్యానవన సాగువైపు మళ్లిస్తున్నామని, ఆక్వా, లైవ్‌స్టాక్ రాబడిపై దృష్టి సారించామని చెప్పారు. జాతీయ స్థాయిలో 3శాతం వృద్ధిరేటు ఉంటే ఏపీలో 11 శాతం సాధించామని తెలిపారు. ప్రతి ఏడాది 10లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం పెంచాలన్నారు. రానున్న నాలుగు నెలల్లో మరో 4వేల కోట్ల రూపాయల నరేగా నిధులు వినియోగించుకోవాలని సూచించారు. రూ 10వేల కోట్ల నిధుల వినియోగం లక్ష్యం కావాలని నిర్దేశించారు. కరవు మండలాల్లో 150 రోజుల పనిదినాలను పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు వంద రోజులకు చేరామని, మిగిలిన 50 రోజుల పనిదినాలను వినియోగించాలన్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులు ముమ్మరం చేయాలన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంటకుంటలు,
ఇంకుడు గుంతల తవ్వకం పనులు వేగవంతం కావాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెరువులు నింపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా ఎకరం పంట ఎండిపోకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏ ప్రాంతంలో మంచినీటి కొరత ఉండరాదన్నారు. దానికి తగ్గట్టుగా సాగు, తాగునీటి సరఫరాను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటువ్యాధుల రహిత రాష్ట్రంగా ఏపీ కావాలన్నారు. మన కష్టంతో రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకువచ్చామని దీనిని తరువాత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.