రాష్ట్రీయం

లక్ష్యసాధనే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కావాలంటే నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయానికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. తవ్వకం, కాంక్రీట్ పనులు ఏప్రిల్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తికావాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్, ఇతర ప్రాధాన్య పనుల పురోగతిపై సోమవారం ప్రజావేదిక హాల్‌లో సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాసితులైన గిరిజనులకు నిర్మిస్తున్న 4,146 ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని అధికారులు వివరించారు. జనవరి ఒకటో తేదీకల్లా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులన్నీ పూర్తికావాలని నిర్దేశించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం 61.03 శాతం పూర్తికాగా, తవ్వకం పనులు 81, కాంక్రీట్ పనులు 48.6శాతం పూర్తయ్యాయని చెప్పారు. కుడి ప్రధాన కాలువ 90శాతం, ఎడమ ప్రధాన కాలువ 65.54, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.94 శాతం, పూర్తయిందని తెలిపారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్‌వే, పైలెట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ప్లాంక్‌కు సంబంధించి 5.11 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్‌వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 60వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు జరిగాయని, 39వేల క్యూబిక్ మీటర్ల మేర కాపర్‌డ్యామ్ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటివరకు రూ. 15,025.45 కోట్లు ఖర్చు కాగా జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన తరువాత రూ.9,889.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.. ఇందులో కేంద్రం రాష్ట్రానికి రూ.3,162.32 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. ప్రాధాన్య ప్రాజెక్ట్‌లకు సంబంధించి అడవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కూడా పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎంఒ ముఖ్యకార్యదర్శి జీ సాయిప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సీఎం అదనపు కార్యదర్శి ఏవీ రాజవౌళి నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..పోలవరంపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు