రాష్ట్రీయం

హోరెత్తిన నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కార్తిక సోమవారం, ఏకాదశి సుముహూర్తం.. నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు మొగ్గు చూపడంతో రాష్టవ్య్రాప్తంగా ఎన్నికల కోలాహలం కనిపించింది. నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ప్రజల్లో గెలుపు ధీమాను కనబర్చడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యాక ఈ నెల 14, 19 తేదీలనే శుభ ముహూర్తంగా అభ్యర్థులు భావించారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో పాటు పలువురు మంత్రులు, చివరి నిమిషంలో టికెట్ సంపాదించిన అభ్యర్థులు కూడా సోమవారమే దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వెళ్లే రహదారులన్నీ భారీ ర్యాలీలు, కాన్వాయిలతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలు అభ్యర్థుల ర్యాలీలు, నినాదాలతో హోరెత్తాయ. హైదరాబాద్ నగరంలోని కర్మాన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ హోంమంత్రి సబితా ఇందిరారెడ్డి భారీ ర్యాలీతో మహేశ్వరం బయలుదేరడంతో శ్రీశైలం రోడ్‌పై ఆరు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే పహాడి షరీఫ్ నుంచి మహేశ్వరం క్రాస్ రోడ్ వరకు బీజేపీ అభ్యర్థి రాములు యాదవ్ ర్యాలీ బయలుదేరింది. ఈ రెండు పార్టీల భారీ ర్యాలీ వల్ల రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ముషీరాబాద్ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్, ఖైరతాబాద్ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితర ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలుతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది.
అలాగే రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, గద్వాలో డికె అరుణ, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో కె జానారెడ్డి, మిర్యాలగూడలో ఆర్ కృష్ణయ్య, తదితర ప్రముఖులు ఉన్నారు.