రాష్ట్రీయం

మాతోనే సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 19: పొరపాటున మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో అందరూ ఘానాపాటీలే, అయితే 30 ఎండ్లలో కరెంట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన అన్నారు. ప్రపంచ మేధావినని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేక పోయాడని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుంభకోణాలు, లంభకోణాలు చేయడం తమ వల్ల కాదని కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేసినందునే రాష్ట్ర సంపద పెరగడం వల్లె ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని 70కిపైగా పనులు చేసి చూపించామని అన్నారు. అడ్డం, పొడుగు మాటలు చెప్పి ఎగపెట్టడం కాంగ్రెస్, టీడీపీల నైజం అని అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కేవని తాను ఏ ఒక్క టీఆర్‌ఎస్ కార్యకర్తకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. పూర్తి పారదర్శకతతో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో ఐదు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే వంద శాతం సబ్సిడీపై సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని పాలకుర్తి సోమేశ్వరుని సాక్షిగా చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 43వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు బందు పథకాన్ని ఐక్యరాజ సమితి గుర్తించి ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆరా తీస్తున్నారని అన్నారు. అధికారంలో వచ్చినట్లైతే రైతు బంధు పథకాన్ని ఎకరానికి పది వేలు ఇచ్చే విధంగా పెంచుతామని హామీ ఇచ్చారు. లింగంపల్లి-మల్కాపూర్ ప్రాజెక్టు పూర్తి అయినట్లైతే దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వంద టీఎంసీల నీరు వస్తుందని దీంతో పంటలు బాగా పండి రైతులు ఆర్ధిక అభివృద్ధి సాధిస్తారని అన్నారు. తద్వారా తెలంగాణ ధనవంతుల రాష్ట్రంగా మారిపోతుందని అన్నారు. ప్రతి మండలానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ఐకేపీలో పనిచేస్తున్న మహిళలకు పర్మినెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ద్వారా ఇప్పటికే 80వేల మంది లబ్ధిపొందారని అన్నారు. పాలకుర్తి బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు రావాలని చూస్తే ఇక్కడ నుండి ఎర్రబెల్లి భారీ మెజార్టీతో గెలువడం ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు. దయాకర్‌రావు కోరిక మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్ పాల్గొన్నారు.
చిత్రాలు.. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పక్కనే పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. *సభకు భారీగా హాజరైన ప్రజలు, కార్యకర్తలు