రాష్ట్రీయం

కన్నులపండువగా లక్ష దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, నవంబర్ 19: కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీశైలంలో లక్ష దీపోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెల్లవారుజామునే భక్తులు పెద్దసంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణానదిలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులు తీశారు. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలోని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుష్కరిణి వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తింది. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. భక్తులతో శ్రీశైలం వీధులు కిటకిటలాడాయి.

చిత్రం..శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం