రాష్ట్రీయం

ప్రపంచ అస్థిరతకు ఆర్థిక అసమానతలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 19: ప్రపంచ అస్థిరతకు ఆర్థిక అసమానతలే కారణమని, ప్రపంచ దశను మార్చే సామర్థ్యం భారత్‌కు ఉందని తునీషియా దేశం పరిశ్రమల సమాఖ్య అధ్యక్షురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వైదేడ్ బొచమయి పేర్కొన్నారు. సత్యసాయి 93వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొచమయి స్ర్తి శక్తి, ఔన్నత్యం, శాంతి సుస్థిరత, సమానత్వం అనే అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. భారతదేశ శాంతి సుస్థిరత, శాంతి స్థాపనకు స్వరాజ్య పోరాటంతో మహాత్మాగాంధీ బాటలు వేశారన్నారు. హింసా మార్గంలో సాధించలేని స్వరాజ్యాన్ని అహింసా మార్గంలో సాధించి చూపిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నేడు ప్రపంచాన్ని ఆకర్శిస్తోందన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిరతకు బీజం వంటివన్నారు. సాంకేతిక పురోగతి, ప్రపంచీకరణ అసమానతలు తొలగించేందుకు దోహదకారి అన్నారు. మహిళ మాతృమూర్తిగా కుటుంబానికే గాక దేశానికి, ప్రపంచానికి పునాదివంటిదన్నారు. భారతదేశం మహిళల ఔన్నత్యాన్ని ఆమె కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలన్నారు. సహనం కొరవడి ఛాందసవాదంతో హింస వైపు నేటి సమాజం పయనించడం ప్రమాదకరమన్నారు. హక్కులతోపాటు ప్రతి ఒక్కరూ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే హింసకు తావు ఉండదన్నారు. పరస్పరం సుహృద్భావ వాతావరణంలో తోటివారితో కలిసి జీవించడం అలవర్చుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఆదర్శంగా నిలవాలన్నారు.
విభేదాలు విడనాడి స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి శాంతికి బీజం వేయాలని ఆకాంక్షించారు. భగవాన్ సత్యసాయి బాబా సేవలు ఆచరించి అందించిన సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ప్రేమతో గడపడం, ప్రేమతో మెలగడం రోజువారి దినచర్యగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్న సత్యసాయి సూక్తిని అంతా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..పుట్టపర్తిలో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో ప్రసంగిస్తున్న
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వైదేడ్ బొచమయి