రాష్ట్రీయం

గ్రూప్-2 వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 24, 25న నిర్వహించాల్సిన పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేయాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈమేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆదేశించినట్టు సిఎంవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే ఏప్రిల్ 4న జరుగనున్న కానిస్టేబుళ్ల నియామక పరీక్షను కూడా వాయిదా వేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. శాసనసభలో శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కలిసి, ఏప్రిల్ 4న ఆర్‌ఆర్‌బి పరీక్ష ఉండటం వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందని, ఆ రోజు జరిగే కానిష్టేబుల్ నియామక పరీక్షను వాయిదా వేయాల్సిందిగా కోరడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా ఉండగా గ్రూప్-2 కేటగిరిలో మరిన్ని పోస్టులను పెంచే అవకాశం ఉండటంతో ఏప్రిల్‌లో నిర్వహించబోయే పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 439 గ్రూప్-2 పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కమలానాథ్ కమిటీ చేపట్టిన ఉద్యోగుల విభజన తుది దశకు చేరుకోవడంతో గ్రూప్-2 పోస్టుల సంఖ్య సుమారు 600 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిని రెండు నెలల పాటు వాయిదా వేసి కొత్తగా తేలనున్న ఖాళీలతో మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సై నియామక పరీక్షలను ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగులోనూ నిర్వహించడంతో పాటు గతంలో ప్రకటించినట్టుగా ఇంగ్లీష్ పేపర్‌కు వేయిటేజి ఇచ్చే నిబంధనను తొలగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహించే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు జరుపకూడదని ప్రభుత్వం భావిస్తుంది.
కవితకు నిరుద్యోగుల థ్యాంక్స్
గ్రూప్-2, కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షలు వాయిదా పడటం పట్ల నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట కవితకు నిరుద్యోగులు కృత్ఞతలు తెలిపారు. వారం రోజుల కిందట గ్రూప్-2, కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయించాల్సిందిగా కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాయిదా వేయించారని కృత్ఞతలు తెలిపినట్టు నిరుద్యోగులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం కవితకు కృతజ్ఞతలు తెలుపుతున్న నిరుద్యోగులు