రాష్ట్రీయం

వీసీ రీకాల్ కోరతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను రీ-కాల్ చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, అది కేంద్రం పరిధిలో ఉండటంతో ప్రధానితో స్వయంగా చర్చించి రెండు, మూడు రోజులలోనే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తా’నని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. శాసనసభలో శనివారం హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో చోటు చేసుకున్న అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు చేసిన డిమాండ్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిచ్చారు. వైస్ చాన్స్‌లర్‌ను రీకాల్ చేయాలని శాసనసభలో తీర్మానం చేయాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఒక విసిని రీకాల్ చేయాలని శాసనసభలో తీర్మానం చేయాల్సిన స్థాయి అంశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేస్తే సభ గౌరవాన్ని మనకు మనం తగ్గించుకున్నట్టు అవుతుందని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్‌సియు, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఖండించారు. ఇక్కడ జరిగిన ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. హెచ్‌సియుకు రాహుల్ గాంధీ, కేజ్రివాల్, ఇతర రాజకీయ పార్టీల నేతలు వచ్చిపోవడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలోనే తాను అక్కడికి వెళ్లలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ తమ ఎంపి విశేశ్వర్‌రెడ్డిని తానే అక్కడికి పంపించి విషయం తెలుసుకున్నానని చెప్పారు. రాజకీయపరంగా సిద్ధాంత వైరుధ్యాలపై విద్యాలయాలను వేదికగా చేసుకుని కలుషితం చేయవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. వివక్షలేని సమాజం కోసం మేధావులు, ప్రగతిశీల శక్తులు, సంస్థలు ఐక్యంగా ముక్తకంఠం పని చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రోహిత్ మృతి తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. రోహిత్ తల్లిని పరామర్శించేందుకే జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య హైదరాబాద్‌కు వచ్చారన్నారు. కన్నయ్యను అరెస్టు చేయవద్దని, ఆయన సభకు అడ్డు చెప్పవద్దని తానే పోలీసులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. హెచ్‌సియు సిబ్బంది మాత్రమే కన్హయ్యను అడ్డుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భవిష్యత్‌లో హెచ్‌సియు, ఉస్మానియా వర్సిటీలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై దాడి జరిగినట్టు ఆయన నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ రెండు యూనివర్సిటీలలో పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు సభ్యులు చెప్పినందున పోలీసు ఉన్నతాధికారితో నిష్పాక్షికంగా విచారణ జరిపించి నివేదిక సభకు అందజేస్తామని ఆయన తెలిపారు.