రాష్ట్రీయం

టెన్త్ ఇంగ్లీష్ పేపర్‌లో దొర్లిన తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/మార్కాపురం, మార్చి 26: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఇంగ్లీషు పేపర్ -1 ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లీషు పేపర్-1 పరీక్ష పత్రంలో 13వ ప్రశ్నకు సంబంధించిన పేరా ‘ది డియర్ డి పార్టెడ్-2’ అనే పాఠ్యాంశానికి చెందినదిగా బ్రాకెట్‌లో ఇచ్చారు. అయితే వాస్తవంగా ఆ పేరాలో ఇచ్చిన వాక్యం ‘స్టోర్డ్‌హౌస్’కు చెందినదిగా ఉపాధ్యాయులు గుర్తించారు. ఆ ప్రశ్నకు ఇంచుమించు అందరు విద్యార్థులు సమాధానం తప్పుగానే రాసినట్లుగా తెలుస్తోంది. ఇంగ్లీషు పేపర్-1 ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నకు సంబంధించి దొర్లిన తప్పును అధికారులు గుర్తించి ఆ ప్రశ్నకు విద్యార్థులు జవాబు కరెక్టుగా రాసినా, తప్పుగా రాసినా మార్కులు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
పట్టుబడిన ఇద్దరు నకిలీ విద్యార్థులు
కడప: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అసలైన విద్యార్థులకు బదులుగా ఇద్దరు నకిలీ అభ్యర్థులు పరీక్ష రాస్తూ పట్టుబడిన సంఘటన శనివారం కడప జిల్లా పులివెందుల జిల్లా పరిషత్ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పులివెందుల జిల్లా పరిషత్ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో శనివారం విద్యార్థులు ఇంగ్లీషు పేపర్-1 పరీక్ష రాశారు. ఇన్విజిలేటర్ రవికుమార్‌రెడ్డి విద్యార్థుల హాల్ టికెట్లు తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు ఇన్విజిలేటర్‌ను ఏమార్చి గదిలోకి వెళ్లి వారి స్థానాల్లో కూర్చుని పరీక్ష రాయడం ప్రారంభించారు. అయితే ఇన్విజిలేటర్ మరొకమారు హాల్‌టికెట్లను, పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో పి.సుధీర్‌బాబు, వై.హనుమంతరెడ్డి అనే విద్యార్థులపై అనుమానం వచ్చింది. ఆయన ఫిర్యాదుపై చీఫ్ సూపరింటెండెంట్ శివరామిరెడ్డి వచ్చి ఆ ఇద్దరిని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. వీరిద్దరిలో పి.సుధీర్‌బాబుకు డమీగా ఎస్ కిశోర్, వై హనుమంతరెడ్డికి డమీగా వి సుబ్బయ్య పరీక్ష రాస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్ ఆ ఇద్దరినీ పరీక్ష హాల్ వద్ద కాపలా ఉన్న పోలీసులకు అప్పగించారు. ఇక అసలైన విద్యార్థుల ఆచూకీని పోలీసులు ఆరా తీయగా పరీక్ష రాయాల్సిన వై.హనుమంతరెడ్డి చెన్నైలో ఉండగా, పి సుధీర్‌బాబు పరారీలో ఉన్నట్లు తెలిసింది.