రాష్ట్రీయం

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి బదిలీల ప్రక్రియ జరుగనుందని టిఎన్‌జివో నేతలు వెల్లడించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల బదిలీ అంశాన్ని చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే నెల నుంచి బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు వారు తెలిపారు. అలాగే భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒకే చోట పని చేయడానికి అవకాశం కల్పించడంతో పాటు వితంతువులకు బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్టు వారు తెలిపారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించగా, ఉద్యోగుల బదిలీలకు విధి విధానాలను తయారు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.