జాతీయ వార్తలు

యోగాతో క్యాన్సర్ నయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, మార్చి 26: క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను యోగా నయం చేస్తుందని ఒక పరిశోధనలో రుజువైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా ‘ఆయుష్’ను ఉపయోగించువాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘యోగా క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేస్తుందని బెంగళూరుకు చెందిన ఓ పరిశోధాన సంస్థ నిరూపించింది’ అని శనివారం గోవాలో జాతీయ ఆరోగ్య ప్రదర్శనను ప్రారంభిస్తూ మంత్రి చెప్పారు. అయితే మంత్రి ఆ పరిశోధనా సంస్థ పేరు మాత్రం పేర్కొనలేదు. కాగా, అలోపతికి ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా ఆయుర్వేదం, యోగా, ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్)ను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా తన ప్రసంగంలో ఇదే విషయం చెప్పారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ‘ఉమ్మడి యోగా ప్రోటోకాల్’ అనే గైడ్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఆయుష్‌ను ప్రచారం చేసేవారు అల్లోపతికి వ్యతిరేకం కాదని, అన్ని రకాల వైద్య విధానాల ప్రధాన లక్ష్యం రోగి ఆరోగ్యమేనని ఆయన చెప్పారు. అన్ని వైద్య విధానాలను సమన్వయం చేయాలని, అప్పుడే క్యాన్సర్, అధిక మధుమేహం, స్థూలకాయం లాంటి వాటిని సమూలంగా నిర్మూలించవచ్చని మంత్రి చెప్పారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆయుష్ రంగంలో అమెరికాతో మన దేశం ఒక ఒప్పందం కుదుర్చుకోనుందని ఆయన చెప్పారు. ‘గత ఏడాదిన్నర కాలంలో ఆయుష్ గొప్పతనం అమెరికాసహా అనేక ప్రాంతాలకు చేరింది. ఆయుష్ వైద్య విధానాల ద్వారా క్యాన్సర్‌ను నయం చేసే విషయంలో పరిశోధనకోసం త్వరలోనే మనం అమెరికాతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నాం’ అని నాయక్ చెప్పారు. ఆయుష్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా మన దేశంతో చేతులు కలపాలనుకుంటోందని ఆయన చెప్పారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) తరహాలో దేశంలోని ప్రతి రాష్ట్రంలోను ఒక ఆయుష్ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసే దిశగా తన మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని శ్రీపాద్ నాయక్ చెప్పారు.