రాష్ట్రీయం

పాదయాత్రలో కన్నీటి వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 5: శ్రీకాకుళం జిల్లాలోకి వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం నుంచీ అన్నివర్గాల నుంచీ కన్నీటి వినతులు అందుతూనే ఉన్నాయి. బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గం, సంతవురిటి నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా దవళపేట చేరుకోగానే జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన కౌలురైతు రమణారావు హుదూద్ తుపాను వల్ల తానెంత నష్టపోయిందీ, అందుకు ఫలితంగా ఎన్నిసార్లు తిరిగినా పరిహారం రాలేదని ఆవేదన పంచుకున్నారు. అతని ఆవేదన ఆలకించిన జగన్ అధికారంలోకి రాగానే అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. రాజకీయ కక్షతో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తనను తొలగించారని మొరపెట్టుకున్న దవళపేటకు చెందిన కళ్యాణి తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. జి.సిగడాం మండలంలో చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి బంధువులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని పలువురు రైతులు జగన్‌కు ఫిర్యాదు చేస్తూ లావేరు మండలంలో నారాయంసాగరాన్ని ఆధునికీకరణ చేయాలని, ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కాలువకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. రణస్థలం మండలంలో దాదాపు 25 పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని పలువురు నిరుద్యోగులు ఆరోపించారు. అనంతరం ఆనందపురం ఆగ్రహారం చేరుకున్న
జగన్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలసి తమకు ఎంతో నష్టం కలిగిస్తున్న సీపీఎస్ రద్దయ్యేలా చూడాలన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న తమకు న్యాయం చేయకపోగా కమిషన్ల కోసం ఉపాధి లేకుండా చేస్తున్నారని విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుడు శేషారత్నం ఫిర్యాదు చేసారు. అనంతరం పొందూరు చేరుకున్న జగన్ ఆమదాలవలస నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ముఖ్యనేత తమ్మినేని సీతారాం, సీనియర్ నేతలు ధర్మాన కృష్ణదాస్, పార్టీ యువజన విభాగం కార్యదర్శి చిరంజీవినాగ్ ఘన స్వాగతం పలికారు. ముడి సరకుల ధరలు విపరీతంగా పెరిగి ఉత్పత్తి వ్యయం భారమైందని, అమ్మకాలు తగ్గాయని, కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని పొందూరులో ఖాదీ చేనేత కార్మికులు తమ కష్టాలు వివరించారు. చేనేతకు ముడి సరకులపై రాయితీ ఇవ్వాలని, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అన్నీ పరిష్కరిస్తామన్నారు. పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరం వద్ద జగన్‌ను ప్రజలు పెద్దసంఖ్యలో కలిసారు. దారి పొడవునా ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ జగన్ పాదయాత్ర కొనసాగింది.

చిత్రం..జగన్‌తో కలసి పాదయాత్రలో జూనియర్ లెక్చరర్ అర్హత కలిగిన యువతులు