రాష్ట్రీయం

మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండని తెలంగాణ ఓటర్లకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. ఆలోచించి ఓటు వేయాలని, పారదర్శకంగా ఉంటూ, ఎవరైతే తక్కువ అవినీతితో పాలన అందిస్తారో అలాంటి వారికే ఓటు వేయండి అని సందేశంలో పవన్ కల్యాణ్ కోరారు. తెలంగాణ గురించి దాసరథి చెప్పిన మాటలను ఉటంకిస్తూ.. స్వాతంత్య్ర సమర యోధులు, తెలంగాణ పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రజలు అనేక ఒడుదుడుకుల మధ్య ప్రత్యేక తెలంగాణను సాధించుకోగలిగారు. ఆ పోరాట స్ఫూర్తి, త్యాగాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాణ్ని, గుర్తించినవాణ్ని కనుకనే తెలంగాణ అంటే తనకు గౌరవమని పేర్కొన్నారు. ఇప్పుడు మన ముందున్నది- తెలంగాణ ఇచ్చామనే వాళ్లు, తెలంగాణ తెచ్చామనే వాళ్లు, తెలంగాణను దించామనే వాళ్లు.. వారందరి మధ్యలో ఎవరికి ఓటు వేయాలనే అయోమయ పరిస్థితులున్నాయ. అయితే నా విన్నపం ఒక్కటే.. అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే పాలక అందించగలరో అలాంటి వారి గురించి లోతుగా ఆలోచించి.. వారికి ఓటు వేసి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.