రాష్ట్రీయం

లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 5: ఆంధ్రనేత నేత.. మాజీ ఎంపీ లగడపాటీ రాజగోపాల్ జూటా సర్వేలను తెలంగాణ ప్రజలు నమ్మరని.. తెలంగాణలో వచ్చేది నూరుకు నూరు శాతం టీఆర్‌ఎస్ సర్కారేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండ పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టిన దొంగ లగడపాటి రాజగోపాల్ అని దుయ్యపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. లగడపాటి నిమ్స్ ఆసుపత్రిలో దొంగ దీక్ష చేపట్టి రాత్రికి రాత్రే పారిపోయాడని విమర్శించారు. చంద్రబాబు కుట్రలో భాగంగా టీఆర్‌ఎస్ సర్కార్ రాకుండ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆంధ్రలో కలిపే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలు సహాజమని.. మూడవ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏలా తెచ్చుకున్నామో ..నేడు మన ప్రభుత్వాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్ర నుండి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో రాదని..దొంగ సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజక వర్గంలో ఓటమి చెందుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓడితే గాంధీభవన్‌కు రానని చెప్పి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరునాడే మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులమని చెప్పుకునే జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,డీకే అరుణ లాంటి నేతలు తమ సొంత నియోజక వర్గాలకే పరిమితమైనారని విమర్శించారు. తాను మహబూబునగర్, నల్గోండ, వరంగల్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్‌తో పాటు పలు నియోజక వర్గాలను పర్యటించినట్లు పేర్కొన్నారు. లగడపాటి ఎవరి చెవ్వులో పూలు పెడుతున్నావు.. తెలంగాణ ప్రజలకు కళ్లకు గంతలు కట్టలేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గెలిస్తే దొంగ రాత్రి కరెంటు వస్తదని, 24 గంటల కరెంట్ మళ్లీ మూడు గంటలకే పరిమితమవుతుందన్నారు. చంద్రబాబు పంపిన డబ్బులు జనగామ వద్ద దొరికాయన్నారు. క్వార్టర్ సీసలు ముఖ్యమో.. తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యమో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజా కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో వందసీట్లతో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావటం, కేసీఆర్ మళ్లీ సీఎం కావటం ఖాయమని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

చిత్రం..సిద్దిపేట ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు