రాష్ట్రీయం

నక్కజిత్తుల బాబును నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 5: నక్కజిత్తుల చంద్రబాబును నమ్మొద్దని, ఏమరుపాటుతో వ్యవహరిస్తే తెలంగాణను ఏపీలో కలుపుకుంటడని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. అధికార కాంక్షతో మాయల మరాఠీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా, ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబులు చెట్టపట్టాలేసుకొని తిరుగుతుండడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కరువు కానుండగా, పేదల అభ్యున్నతికి అమలుచేస్తున్న పథకాలను ఎత్తివేసే ప్రమాదముందని హెచ్చరించారు. వలస శక్తులకు అవకాశం కల్పిస్తే అథోగతిపాలు కాక తప్పదని, అలాగే అభివృద్ధి కోసం అమరావతికి దరఖాస్తు చేసుకుందామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అంతేగాకుండా కాంగ్రెస్ నేతల ఢిల్లీ గులాంగిరీని ఇంకా ఎంతకాలం సహిద్దామని, ఇక్కడి ప్రాజెక్టులు అడ్డుకోవడంతో పాటు సీలేరు విద్యుత్ కేంద్రం, ఏడు మండలాలను కలుపుకున్న బాబుకు ఇక్కడ ఏం పని? అని ఆయన నిలదీశారు. రాష్ట్ర సంపద పెరుగుతుంటే పక్క రాష్ట్రాలకు కన్ను కుడుతుండగా, దొంగ సర్వేలు ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మానవీయ కోణంలో వివిధ పథకాలు అమలు చేస్తుండగా, దేశంలోనే తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు ఏ రాష్ట్రంలో కూడా రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు అమలు కావడంలేదని తెలిపారు. గజ్వేల్ వేదికగా చివరి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తుండగా, 58 యేండ్ల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితం, అమరుల ఆత్మార్పనలు, సీమాంధ్ర నేతల వేధింపుల ఫలితంగానే ఇక్కడి ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నట్లు చెప్పారు. ఓట్లు అనగానే గాలిగాలి గత్తర కాకుండా ఎంతో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని, తప్పిదంతో వ్యవహరిస్తే గెలిచిన వ్యక్తి ఐదేళ్ల వరకు కనిపించడని పేర్కొన్నారు. అయితే కృష్ణానదిలో నీరు లేదని, గోదావరి నీటిని పంచుకుందామని చంద్రబాబు కుట్రలు పన్నుతుండగా, ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మలు, ముద్దన్నలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని నిలదీశారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ వాటా సైతం ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి బీడు భూములు సస్యశ్యామలం కావడం చంద్రబాబు కు కంటగింపుగా మారిందని తెలిపారు. అధికార కాంక్షతో బక్కోడైన కేసీఆర్ పైకి కాంగ్రెస్, టీడీపీలు కత్తులు దూస్తుండగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణను బానిస కానివ్వనని చెప్పారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఏపీలో కలిపిన కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో కలిసి నన్ను నరకడానికి గొడ్డలి పట్టుకొని తిరుగుతున్నట్లు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక ఆదాయం రూ. 9కోట్ల 56లక్షలు కాగా, నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 2057 కోట్లని స్పష్టం చేశారు. చిమ్మ చీకటిలో ఉన్న తెలంగాణాలో వెలుగులు నింపగా, అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు నయా పైసా ఇవ్వనని హెచ్చరించినా నోరు మెదపని దద్దమ్మలు ఇక్కడి కాంగ్రెస్ నేతలని నిలదీశారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి లక్ష్యంగా, కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్ సర్కార్‌ను విమర్శించే నైతికహక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టగా, భవిష్యత్తులో ఈఎన్‌టీకి అవకాశం కల్పించడంతోపాటు రాష్ట్రంలోని 4 కోట్లమంది హెల్త్ ప్రొఫైల్ తయారుచేస్తామని చెప్పారు. కేంద్రం ముస్లింలకు రూ. 4వేల కోట్ల బడ్జెట్ కెటాయించగా, తెలంగాణ రూ. 2వేల కోట్లు కెటాయించి ముస్లింల స్థితిగతులను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
చిత్రాలు.. గజ్వేల్ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్,* సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు