రాష్ట్రీయం

వారిద్దరూ నియంతలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 5: తెలంగాణ విద్యార్థులు, ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో వారి కలలు కేసీఆర్ కుటుంబ, అవినీతి అప్రజాస్వామిక పాలనతో అడియాశలయ్యాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజాఫ్రంట్‌ను గెలిపిస్తే వారి కలలను సాకారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్, ప్రజాకూటమి బహిరంగ సభలో రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిలు మోదీ, కేసీఆర్ పాలనలపై నిప్పులు చెరిగారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతు తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ మార్పు తుఫాన్‌ల వస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్, మిత్రపక్షాల విజయంతో మొదలయ్యే మార్పు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించేవరకు కొనసాగుతుందన్నారు. మోదీకి జిఎస్టీ, నోట్ల రద్దు, రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో మద్ధతునిచ్చిన కేసీఆర్ పార్టీ టీఆర్‌ఎస్ కాస్తా టీ.ఆర్‌ఎస్‌ఎస్‌గా మారిందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ రిమోట్ కంట్రోల్ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ల ద్వారా నరేంద్రమోదీ చేతిలో ఉందన్నారు. రైతులను ఆదుకోలేని మోదీ ప్రభుత్వం 17మంది బడా వ్యాపారుల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు, యువత ఆశించిన నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు కేసీఆర్ కుటుంబ పాలనతో నీరుగారిపోయాయన్నారు. కేసీఆర్ ఖావోకమిషన్‌రావుగా మారిపోగా, ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో వేలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో 4,500మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని, మహిళలు, యువత నైరాశ్యంలో పడిపోయారన్నారు. మద్ధతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని, పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని చెప్పి చేయకపోగా సీఎం కేసీఆర్ మాత్రం 300కోట్లతో ప్రగతిభవన్ కట్టుకున్నాడన్నారు. నల్లగొండ టీఆర్‌ఎస్ ప్రచార సభలో తాను నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పిన రీతిలోనే అన్ని సభల్లోనూ అదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 33లక్షల తెలంగాణ నిరుద్యోగ యువతను, డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది పేదలను, కష్టాల్లో ఉన్న రైతులను, ఆత్మహత్యల పాలైన రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటు చురకలంటించారు. నాలుగేళ్ల కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పనిచేసిందన్నారు. నల్లగొండకు వచ్చి మరోసారి వంద పడకల ఆసుపత్రి హామీనే తిరిగి కేసీఆర్ వల్లే వేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీతో పాటు పంటలకు మద్ధతు ధర భారీగా పెంచుతున్నామన్నారు. పేదవారికి 5లక్షల ఇంటి నిర్మాణం జరిపిస్తామన్నారు. ప్రతి మండలంలో 30పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. పేదలకు ఐదులక్షల ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునర్ నిర్మించి మరిన్ని వేల ఎకరాల సాగునీరందిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించడమే కాంగ్రెస్, ప్రజాకూటమి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశంలో, తెలంగాణలో యువత, రైతులు, మహిళల సంక్షేమానికి చర్యలు చేపడుతుందని, నీరవ్‌మోదీ, మాల్యా, అంబాని సహా మోదీ పాలనలో దోపిడికి గురైన సొమ్మును రాబట్టి ప్రజాప్రయోజనాలకు వెచ్చిస్తామన్నారు. పాఠశాల, కళాశాల విద్య అభివృద్ధికి 20శాతం నిధులు కేటాయిస్తామన్నారు. నేడు నాచేతిలో ఉన్న ఫోన్ సహా అంతా మేడిన్ చైన్‌గా సాగుతుందని మునుముందు మేడిన్ తెలంగాణ, మేడిన్ నల్లగొండగా అభివృద్ధి సాధించాలన్నదే తెలంగాణ ప్రజల కలగా, భవిష్యత్‌గా ఉండాలని కాంగ్రెస్ కోరుతుందని అందుకు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకరావాలని రాహుల్‌గాంధీ కోరారు.

చిత్రం..కోదాడ సభా వేదికపై రాహుల్‌గాంధీ, చంద్రబాబు