రాష్ట్రీయం

నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించి 2019 మార్చి నెలకు 70,512 టిక్కెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పిఆర్వో డాక్టర్ తలారి రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో భాగంగా 11,537 సేవా టిక్కెట్లు, ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 58,975 సేవా టిక్కెట్లు ఉన్నాయన్నారు. భక్తులు దీనిని గుర్తించి ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోరారు. కాగా తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా ఈనెల 7వ తేదీన నిర్వహించాల్సిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలియజేశారు.